Aamir Khan : 61 ఏళ్ళ వయసులో సైలెంట్ గా మూడో పెళ్లి చేసుకోబోతున్న ఆమిర్ ఖాన్.. ఆమెతోనే.. ఎప్పుడు ఎక్కడ?
గత రెండేళ్లుగా ఆమిర్ ఖాన్ గౌరి స్ప్రాట్ అనే మహిళతో రిలేషన్ లో ఉండగా కొన్ని నెలల క్రితం ఈ విషయాన్ని మీడియా ముందే తెలిపాడు. (Aamir Khan)
- Saketh U
- Updated on- June 3, 2026 / 05:51 PM IST
Aamir Khan
Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన సినిమాలతో పాటు అప్పుడప్పుడు తన రిలేషన్స్ తో కూడా వార్తల్లో నిలిచారు. గత కొన్నాళ్లుగా ఆమిర్ ఖాన్ గౌరి అనే మహిళని ప్రేమిస్తున్నట్టు, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు రాగా ఆమీర్ దాన్ని నిజమే అని కొన్ని నెలల క్రితమే ప్రకటించేశాడు. అయితే ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారట.
ఆమిర్ ఖాన్ మొదట 1986లో నటి రీనా దత్తాని పెళ్లి చేసుకోగా ఈ జంట 2002 లో విడిపోయింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ కిరణ్ రావ్ ని 2005లో పెళ్లి చేసుకోగా వీళ్ళు 2021లో విడిపోయారు. గత రెండేళ్లుగా ఆమిర్ ఖాన్ గౌరి స్ప్రాట్ అనే మహిళతో రిలేషన్ లో ఉండగా కొన్ని నెలల క్రితం ఈ విషయాన్ని మీడియా ముందే తెలిపాడు.
Also See : Ram Charan : అది బాడీ కాదు బాక్సాఫీస్.. పెద్ది కోసం చరణ్ ట్రాన్స్ఫర్మేషన్.. ఫొటోలు..
తాజాగా బాలీవుడ్ సమాచారం ప్రకారం ఆమిర్ ఖాన్ – గౌరి జులై 5న కేవలం కొద్దిమంది సన్నితుల మధ్యే సింపుల్ గా ముంబైలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. దీంతో ఈ వార్త బాలీవుడ్ లో వైరల్ గా మారింది.
గౌరి స్ప్రాట్ ఎవరంటే..
గౌరి బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురు. ఆమె తండ్రికి అనేక సెలూన్స్ ఉన్నట్టు సమాచారం. గౌరికి గతంలోనే పెళ్లయి విడాకులు తీసుకుంది. ఈమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. బెంగుళూరులో ఓ ఈవెంట్లో ఈమె ఆమిర్ ఖాన్ కి పరిచయం అయి ఫ్రెండ్స్ గా మారి ఆ తర్వాత ఇలా ప్రేమలో మునిగి తేలుతున్నారు. అప్పుడప్పుడు ఆమిర్ ఖాన్ గౌరి కోసం బెంగుళూరుకు వెళ్ళేవాడు అని ఓ ప్రెస్ మీట్ లో తెలిపాడు. ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తుందని సమాచారం.
Also Read : Samantha : ‘పెద్ది’ రిలీజ్.. చిట్టిబాబు కోసం స్పెషల్ వీడియో షేర్ చేసిన సమంత..
