అమీర్ ఖాన్ ఫస్ట్ శాలరీ ఎంతంటే!..

  • Publish Date - August 25, 2020 / 07:20 PM IST

Aamir Khan reveals his first salary: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఎంత పెద్ద నటుడో కొత్తగా చెప్పనవసరంలేదు. గత నాలుగు దశాబ్దాలుగా హిందీ చిత్రసీమలో కొనసాగుతున్న అమీర్ సినిమాల ఎంపిక గురించి పాత్రకు తగ్గట్టు ఆయన ప్రదర్శించే నటన గురించి అందరికీ తెలిసిందే. రూ.100 నుంచి వెయ్యి కోట్ల క్లబ్ వరకు విదేశాల్లో సైతం రికార్డ్ సృష్టించారాయన. ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో అమీర్ కూడా ఒకరు.

అయితే కెరీర్ తొలినాళ్లల్లో ఆయన ఎంత సంపాదించి ఉంటారు.. అమీర్ మొట్టమొదటి జీతం ఎంతో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది కదూ?.. వాటి గురించిన ఆసక్తికర విషయాలు ఇటీవల స్వయంగా అమీరే వెల్లడించారు..

అమీర్‌కు హీరోగా గుర్తింపు తెచ్చినపెట్టిన చిత్రం ‘ఖాయమత్ సే ఖాయమత్ తక్’ (Qayamat Se Qayamat Tak).. జూహీచావ్లా కథానాయికగా నటించిన ఈ సినిమాకు మన్సూర్ ఖాన్ దర్శకుడు. 1988లో ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రానికి అమీర్ అందుకున్న జీతం ఎంతో తెలుసా? అక్షరాలా వెయ్యి రూపాయలు..

ఈ సినిమా కోసం ఆమీర్ 11 నెలలు పని చేశారట. నెలకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 11 నెలలకుగానూ 11 వేల రూపాయల జీతం అందుకున్నారట. ‘ఖాయమత్ సే ఖాయమత్ తక్’ చిత్రం కోసం దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేశాను. నెలకు వెయ్యి రూపాయల జీతం ఇచ్చేవారు అంటూ అప్పటిరోజులను గుర్తు చేసుకున్నారు అమీర్ ఖాన్.