×
Ad

Aata Sandeep : ‘బిగ్ బాస్-5’ లో డ్యాన్సింగ్ కపుల్..

‘ఆట’ సందీప్ తన భార్య జ్యోతితో కలిసి ఈ క్రేజీ రియాలిటీ షోలో పార్టిసిపెట్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది..

  • Published On : August 14, 2021 / 04:11 PM IST

Aata Sandeep Couple

Aata Sandeep: సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘బిగ్ బాస్ 5’ గురించే డిస్కషన్.. కంటెస్టెంట్స్ వీళ్లే.. ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు.. అందరిలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ వీళ్లకే.. అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఎప్పటిలానే వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు.

Bigg Boss 5 : మోర్ ఫన్.. మోర్ ఎంటర్‌టైన్‌మెంట్..

ఇప్పటికి తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కి సంబంధించి లోగో రిలీజ్ చేయడం తప్ప ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే ఓ టాలీవుడ్ టాలెంటెడ్ కపుల్ బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెడుతున్నారట. బుల్లితెర మీద ‘ఆట’ షో తో పాపులర్ అయ్యి ‘ఆట’ సందీప్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ కొరియోగ్రఫర్ సందీప్.

Nagarjuna : ‘బిగ్ బాస్ 5’ షూటింగ్‌లో నాగార్జున.. లుక్ అదిరిందిగా..!

ఆయన తన భార్య జ్యోతితో కలిసి ఈ క్రేజీ రియాలిటీ షోలో పార్టిసిపెట్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది. ఆయన ఫేస్ బుక్ స్టోరీస్‌లో షేర్ చేసిన పోల్ డీటెయిల్స్‌ను బట్టి ఈ వార్త నిజమే అన్నట్లు కథనాలు వస్తున్నాయి. మేమిద్దరం బిగ్ బాస్ షోలో ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు అంటూ సందీప్ పెట్టిన పోల్‌లో 81 శాతం మంది పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వగా 18 శాతం మంది మాత్రం నో చెప్పారు.

దీంతో ఈ డ్యాన్సింగ్ కపుల్ బిగ్ బాస్ 5 లో పాల్గొనబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికి నాలుగు సీజన్లు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని తర్వాత 3, 4 సీజన్లలో హోస్ట్‌గా అదరగొట్టిన కింగ్ నాగార్జున ఈ 5వ సీజన్‌ని కూడా తన స్టైల్లో సరికొత్తగా హోస్ట్ చెయ్యబోతున్నారు. త్వరలో వివరాలు తెలియజేయనున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.

Pic and Video Credit: @ata_sandeep_official

Instagram