‘ఆవిరి’ సెన్సార్ పూర్తి : నవంబర్ 1 విడుదల

‘ఆవిరి’.. సినిమా చూసిన సెన్సార్ టీమ్..ఎటువంటి కట్స్ చెప్పకుండా.. U/A సర్టిఫికెట్ ఇచ్చింది.. సినిమా నవంబర్ 1న థియేటర్స్‌లోకి రాబోతోంది..

  • Publish Date - October 26, 2019 / 06:29 AM IST

‘ఆవిరి’.. సినిమా చూసిన సెన్సార్ టీమ్..ఎటువంటి కట్స్ చెప్పకుండా.. U/A సర్టిఫికెట్ ఇచ్చింది.. సినిమా నవంబర్ 1న థియేటర్స్‌లోకి రాబోతోంది..

ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు నటిస్తూ.. దర్శకత్వం వహించిన హారర్, థ్రిల్లర్.. ‘ఆవిరి’.. దిల్ రాజు సమర్పణలో, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మించాడు. ‘ఈ ఇంట్లో రాజ్ కుమార్ రావు అతని ఫ్యామిలీ నివసిస్తుంది. వారితో పాటు ఒక ఆత్మ కూడా ఉంది.. దానిని మీరు కనిపెట్టగలరా’? అంటూ రిలీజ్ చేసిన ‘ఆవిరి’ టీజర్లకు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

రీసెంట్‌గా ‘ఆవిరి’ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్..ఎటువంటి కట్స్ చెప్పకుండా.. U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఫస్ట్ లుక్‌తోనే ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసిన రవిబాబు టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచాడు. నేహా చౌహాన్, శ్రీ ముఖ్తా, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రధారులు నటించిన ‘ఆవిరి’ ఆడియన్స్‌ని భయపెట్టడానికి, థ్రిల్‌కి గురిచేయడానికి నవంబర్ 1న థియేటర్స్‌లోకి రాబోతోంది.

Read Also : ఆది పినిశెట్టి ‘క్లాప్’ – ఫస్ట్ లుక్

సినిమాటోగ్రఫీ : ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, మ్యూజిక్ : వైధి, ఫైట్స్ : సతీష్, ఆర్ట్ : నారాయణ రెడ్డి, స్క్రీన్‌ప్లే : సత్యానంద్, కథ, నిర్మాత, దర్శకత్వం : రవిబాబు.