‘కరునాడ చక్రవర్తి’ డా.శివ రాజ్ కుమార్, దర్శకుడు పి.వాసు కాంబినేషన్లో రూపొందిన ‘ఆయుష్మాన్‌భవ’.. ఈ నెల 15న విడుదల కానుంది..
‘కరునాడ చక్రవర్తి’ డా.శివ రాజ్‌కుమార్, దర్శకుడు పి.వాసు కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫిలిం.. ‘ఆయుష్మాన్‌భవ’.. రచితా రామ్ కథానాయికగా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 15న విడుదల కానుంది.
ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి.. ద్వారకీష్ సమర్పణలో ద్వారకీష్ చిత్ర బ్యానర్.. మార్క్విస్ సంస్థతో కలిసి నిర్మించింది. ఈ ఏడాదితో ద్వారకీష్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతుంది.
రీసెంట్‌గా ‘ఆయుష్మాన్‌భవ’ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సినిమాకు కన్నడ సెన్సార్ సభ్యులు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు. అనంత్ నాగ్, సుహాసిని మణిరత్నం, శివాజీ ప్రభు, సాధు కోకిల తదితరులు ఇతరపాత్రల్లో నటించారు. సంగీతం : గురుకిరణ్, కెమెరా : దాస్, ఎడిటింగ్ : గౌతంరాజు.