Abhishek Aishwarya
Abhishek Aishwarya : ఇటీవల ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా తన ఫోటోలను, పేరును తప్పుగా వాడుతున్నారని, అలా నా అనుమతి లేకుండా ఉపయోగించుకోడానికి వీలులేకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును కోరింది.(Abhishek Aishwarya)
దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సంస్థలు, వ్యక్తులు ఎవరైనా ఐశ్వర్య రాయ్ పేరు, ఫొటోలు వాడకూడదు అని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా ఢిల్లీ హైకోర్టుని ఇదే విషయంలో ఆశ్రయించాడు.
Also See : Ritika Nayak : ‘మిరాయ్’ భామ రితిక నాయక్.. ఎంత క్యూట్ గా ఉందో..
కొన్ని వెబ్ సైట్స్ నా అనుమతి లేకుండా నా ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నారని, కొంతమంది వ్యక్తులు ఏఐతో నా ఫొటోలు క్రియేట్ చేసి అశ్లీల కంటెంట్ కు ఉపయోగిస్తున్నారని, నా పర్సనాలిటీ, పబ్లిసిటీ, ప్రైవసీ హక్కులకు రక్షణ కల్పించాలని పిటిషన్ వేసాడు అభిషేక్. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పించినట్టు అభిషేక్ తరపున న్యాయవాది తెలిపారు.
ఇలా భార్య భర్తలు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు తమ పేరు, ఫొటోలు వాడుకోకూడదు అంటూ కోర్టులో పిటిషన్ వేయడంతో బాలీవుడ్ లో చర్చగా మారింది.
Also See : Ananya Nagalla : బాబోయ్.. షార్ట్ డ్రెస్ లో అనన్య నాగళ్ళ హాట్ పోజులు..