Aishwarya Rai – Abhishek Bachchan : లగ్జరీ విల్లాలో ఐశ్వర్య – అభిషేక్..

బాలీవుడ్ లవ్లీ కపుల్ ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ మాల్దీవ్స్ ఎందుకు వెళ్లారో తెలుసా?..

Aishwarya Rai Abhishek Bachchan

Aishwarya Rai – Abhishek Bachchan: బాలీవుడ్ లవ్లీ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ తమ గారాల పట్టీ ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు హాలీడే ట్రిప్‌కి వెళ్లారు. ఆరాధ్య 10వ బర్త్‌డే సందర్భంగా ఈ వెకేషన్ ప్లాన్ చేశారు. ఇప్పుడు మీడియా అండ్ సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.

Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..

మాల్దీవులకు వెళ్లే సెలబ్రిటీలందరూ సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ.. బీచ్‌లో సరదాగా తిరుగుతూ.. ఇక ముద్దుగుమ్మలైతే బికినీలో హాట్ హాట్ పోజులిస్తూ సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటారు. కానీ ఈ జంట మాత్రం అలాంటి పిక్స్ ఏవీ పోస్ట్ చెయ్యలేదు. అభిషేక్ – ఐశ్వర్య అమీలా అనే లగ్జరీ విల్లాలో స్టే చేశారు. దీని కాస్ట్ గురించిన వార్తలే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

RRR Movie : ‘నాటు నాటు’ సాంగ్‌కి నడిరోడ్డుపై ఊరమాస్ డ్యాన్స్!

ఈ విల్లాలో ఒక రాత్రి స్టే చెయ్యడానికి రూ. 76 వేలు అవుతుందట. అత్యాధునిక సౌకర్యాలతో కంఫర్టబుల్‌గా ఉండే ఈ విల్లాలో ఆరు, ఎనిమిది బెడ్‌రూమ్స్ ఉంటాయని.. ఐశ్వర్య జంట స్టే చేసిన విల్లాలో సుమారు 20 మంది వరకు ఉండొచ్చని.. అందుకు దాదాపు 14 లక్షలకు పైగా ఖర్చవుతుందని నేషనల్ మీడియా వార్తలు రాసుకొచ్చింది.