చిరంజీవి సర్జా జయంతి.. మేనల్లుడిని తలచుకుంటూ ఎమోషనల్ అయిన అర్జున్..

Chiranjeevi Sarja-Meghana Raj: ప్రముఖ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, పాపులర్ కన్నడ యువ హీరో చిరంజీవి సర్జా ఈ ఏడాది మొదట్లో ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. హీరోయిన్ మేఘనతో పదేళ్లు ప్రేమాయణం తర్వాత 2018 ఆమెను వివాహం చేసుకున్నారు.
కాగా నేడు (అక్టోబర్ 17) చిరంజీవి జయంతి. ఈ సందర్భంగా యాక్షన్ కింగ్ అర్జున్ ఫ్యామిలీ.. నెగిటివిటీని పాజిటివిటీగా మార్చి.. జూనియర్ చిరుకు చిరు నవ్వుతో వెల్‌కమ్ చెప్పడానికి ఓ గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి సర్జా కుటుంబ సభ్యులందరూ పాల్గొని.. మేఘనా రాజ్‌తో కేక్ కటింగ్ చేయించారు. కేక్ కటింగ్ సందర్భంలో.. హ్యాపీ బర్త్‌డేకి బదులు ‘‘హ్యాపీ వెల్‌కమ్ టు యు, హార్ట్‌లీ వెల్‌కమ్ టు యు.. డియర్ జూనియర్ చిరు’’.. అని అందరూ అనాల్సిందిగా అర్జున్ కోరారు. ఈ కార్యక్రమంలో మేఘనకు ఎప్పుడూ మేమందరం అండగా ఉంటామంటూ అర్జున్ మాట్లాడారు.
కాగా చిరంజీవి, నటి మేఘనతో పదేళ్లు ప్రేమాయణం తర్వాత 2018 ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే రెండేళ్ళు కూడా కలిసి జీవించకుండానే ఆమెకు దూరమయ్యారు. చిరంజీవి సర్జా చనిపోయే నాటికి మేఘనా రాజ్ గర్భవతి. ఇటీవల మేఘన సీమంతం వేడుకను చిరంజీవి కుటుంబ సభ్యులు ఘనంగా జరిపించారు.
అయితే ఎందరు ఉన్నా భర్త లేని లోటు మాత్రం ఎవరూ తీర్చలేనిది కదా.. అందుకే ఈ వేడుకలో చిరంజీవి తన పక్కనే ఉన్నాడన్న ఫీల్ కలిగేలా మేఘనా రాజ్ కూర్చున్న కుర్చీ పక్కనే అతని కటౌట్ ఏర్పాటుచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వీడియో చూసిన చిరంజీవి సర్జా అభిమానులు ఆయణ్ణి తలచుకుని కంటతడి పెట్టారు.
https://www.instagram.com/tv/CGZvPLrHHLU/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CBkGaEOnK_D/?utm_source=ig_web_copy_link