Akshay Kumar : పుట్టినరోజున మహాకాళేశ్వర్ ఆలయంలో అక్షయ్ కుమార్.. కొడుకు ఆరవ్, క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన 56 వ పుట్టినరోజు సందర్భంగా మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయన వెంటన కొడుకు ఆరవ్‍తో పాటు, క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఉన్నారు.

Akshay Kumar

Akshay Kumar : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ను దర్శించుకున్నారు. కుమారుడు ఆరవ్, క్రికెటర్ శిఖర్ ధావన్ ఆయన వెంట ఉన్నారు.

Twinkle Khanna : మాస్టర్స్ డిగ్రీ పూర్తి హీరోయిన్‌పై అక్షయ్ కుమార్ ప్రశంసలు.. తెలుగులో ఆ హీరో పక్కన..

అక్షయ్ కుమార్ తన 56 వ పుట్టినరోజు సందర్భంలో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయన వెంట సోదరి, మేనల్లుడు కుమారుడు ఆరవ్, క్రికెట్ శిఖర్ ధావన్ కూడా ఉన్నారు. వీరంతా భస్మ హారతికి హాజరైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీమహాకాల్ లోక్‌కు వెళ్లారు.

Akshay Kumar Indian citizenship : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‎కు భారతీయ పౌరసత్వం

అక్షయ్ కుమార్  సినిమా ‘మిషన్ రాణిగంజ్’ రెస్క్యూ థ్రిల్లర్‌గా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌లో మునుపెన్నడు లేని విధంగా అక్షయ్ కనిపించారు. ఈ సినిమా ‘రాణిగంజ్ కోల్ ఫీల్డ్’లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. భారత్ బొగ్గు గని రెస్క్యూ మిషన్‌కు నాయకత్వం వహించిన దివంగత శ్రీ జస్వంత్ సింగ్ గిల్ పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నారు. అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా, రవి కిషన్, వరుణ్ బడోలా, దిబ్యేందు భట్టాచార్య, రాజేష్ శర్మ, వీరేంద్ర సక్సేనా నటించిన ‘మిషన్ రాణిగంజ్’ అక్టోబర్ 6, 2023 న థియేటర్లలోకి రాబోతోంది.