Arjun Kalyan : బ్రేకప్ టైంలో ఓపికగా ఉండాలంటున్న నటుడు అర్జున్ కల్యాణ్

బిగ్ బాస్ సీజన్ 6 చూసిన వారికి అర్జున్ కల్యాణ్ గుర్తుంటాడు. బీబీ జోడీలో వాసంతితో కలిసి స్టెప్పులు వేసి క్యూట్ కపుల్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా అర్జున్ కల్యాణ్ తన బ్రేకప్ విషయంలో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నాడు.

Arjun Kalyan

Arjun Kalyan : బిగ్ బాస్ సీజన్ 6 చూసిన వారికి అర్జున్ కల్యాణ్ గుర్తుంటారు. మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టి సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసిన అర్జున్ తాజాగా తన బ్రేకప్ విషయంలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా ఆడియన్స్‌కి మాత్రమే కాదు.. వారికి కూడా.. రవితేజ ది గ్రేట్..

అర్జున్ కల్యాణ్ బిగ్ బాస్ సీజన్ 6 లో ఉన్నాడు. వైజాగ్‌లో బీటెక్ చదివి యూఎస్‌లో యాక్టింగ్ కోర్సులు చేసిన అర్జున్ మోడల్‌గా కూడా పనిచేసారు. లవర్ ఫరెవర్, ఉప్మా తినేసింది, అన్ స్పోకెన్, పరిచయం, మిస్సమ్మ వంటి వెబ్ సిరీస్‌లలో నటించారు. 2013 లో వచ్చిన ‘చిన్న సినిమా’ మూవీతో హీరోగా పరిచయం అయ్యారు. నాగ చైతన్య సినిమాలో అనుపమ బాయ్ ఫ్రెండ్‌గా అర్జున్ కల్యాణ్ నటించారు. ప్లే బ్యాక్, వరుడు కావలెను, పెళ్లికూతురు పార్టీ అనే సినిమాలు కూడా చేసారు. బీబీ జోడీ అనే డ్యాన్స్ షోలో వాసంతితో కలిసి డ్యాన్స్‌లు ఇరగదీసి క్యూట్ పెయిర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.

Mahesh Vitta : సైలెంట్‌గా పెళ్లి చేసేసుకున్న బిగ్ బాస్ ఫేమ్, కమెడియన్ మహేష్ విట్టా.. అమ్మాయి ఎవరో తెలుసా?

బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లేముందు తన బ్రేకప్ స్టోరిని షేర్ చేసుకున్న అర్జున్ కల్యాణ్ తాజాగా మరోసారి బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు. బ్రేకప్ టైంలో రెండేళ్లు పూర్తిగా డిప్రెషన్‌లో ఉండిపోయానని చెప్పారు. సరిగ్గా అది కరోనా టైం కావడం ఓవైపు కరోనాతో తలిదండ్రులు ఆసుపత్రిలో ట్రీట్మెంట్‌లో ఉండటం.. మరోవైపు బ్రేకప్ అన్నీ తనను చాలా డిప్రెస్ చేశాయని చెప్పారు. బ్రేకప్ టైంలో బాధపడి ఆ బాధ నుంచి బయటకు వచ్చేయాలని ..ఆ సమయంలోనే  కాస్త ఓపిక పట్టాలని అర్జున్ కల్యాణ్ చెప్పారు. బిగ్ బాస్‌లో క్లోజ్ అయినా వాసంతి, శ్రీసత్యతో తనకు మంచి స్నేహం ఉందని అర్జున్ చెప్పారు. మంచి బ్రేక్ కోసం అర్జున్ కల్యాణ్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.