Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా ఆడియన్స్‌కి మాత్రమే కాదు.. వారికి కూడా.. రవితేజ ది గ్రేట్..

టైగర్ నాగేశ్వరరావు మూవీని కేవలం పాన్ ఇండియా ఆడియన్స్ కోసమే కాదు.. మరో ఆడియన్స్ కోసం కూడా రవితేజ సిద్ధం చేయిస్తున్నాడు. ఎవరి కోసమో తెలుసా..?

Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా ఆడియన్స్‌కి మాత్రమే కాదు.. వారికి కూడా.. రవితేజ ది గ్రేట్..

Raviteja releasing Tiger Nageswara Rao in sign language

Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేస్తున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ మూవీని నూత‌న ద‌ర్శ‌కుడు వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ ఆల్రెడీ మొదలుపెట్టింది. ఇప్పటికే చిత్రం నుంచి రెండు సాంగ్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. ఇటీవల ఒక ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

కాగా ఈ మూవీని కేవలం పాన్ ఇండియా ఆడియన్స్ కోసమే కాదు.. మరో ఆడియన్స్ కోసం కూడా రవితేజ సిద్ధం చేయిస్తున్నాడు. మొగవారు, చెవిటి వారు కూడా ఈ సినిమాని చూసేలా అవకాశం కల్పిస్తున్నాడు. ఈ మూవీని తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ, హిందీ లాంగ్వేజ్స్‌తో పాటు సైన్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నిర్ణయం పట్ల రవితేజ అభిమానులతో పాటు జనరల్ ఆడియన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘రవితేజ ది గ్రేట్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

Also read : Ram Charan : రాజ్‌కుమార్ హిరానీతో రామ్‌చరణ్ కథ చర్చలు.. నిజమేనా..?

ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవి ప్ర‌కాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మరి పాన్ ఇండియా మార్కెట్ లో రవితేజకి ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాలి.