Sheraz Mehdi : ఈ సినిమాకు హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఒకరే.. ఓ అందాల రాక్షసి అంటూ..

నటుడిగా, సంగీత దర్శకుడిగా, డైరెక్టర్ గా పలు తెలుగు, తమిళ సినిమాలతో మెప్పించిన షెరాజ్ మెహదీ ఇప్పుడు తెలుగులో మరో సినిమాతో రాబోతున్నాడు.

Actor Director Music Director Sheraz Mehdi comes with another movie Titled as O andala Rakshasi

Sheraz Mehdi : మన సినీ పరిశ్రమలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్స్ చాలా మందే ఉన్నారు. కథలు రాస్తూనే, దర్శకత్వం వహిస్తూనే హీరోలుగా చేస్తున్నారు ఇటీవల చాలా మంది. నటుడు, దర్శకుడు చేరాడు. నటుడిగా, సంగీత దర్శకుడిగా, డైరెక్టర్ గా పలు తెలుగు, తమిళ సినిమాలతో మెప్పించిన షెరాజ్ మెహదీ ఇప్పుడు తెలుగులో మరో సినిమాతో రాబోతున్నాడు.

షెరాజ్ మెహదీ ‘ఓ అందాల రాక్షసి’ అనే సినిమాతో హీరోగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతున్నాడు. ఈ వినిమాలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ పై సురీందర్ కౌర్ నిర్మాతగా షేర్ సమర్పణలో ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు.

 

ఓ అందాల రాక్షసి ప్రెస్ మీట్ లో డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు భాష్యశ్రీ గారు కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే అన్నిట్లో సపోర్ట్ చేశారు. ఈ సినిమా గ్లామర్ బేస్డ్ మూవీ కాదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఒకరకంగా ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అనుకోవచ్చు. అమాయక మహిళలు కొంతమంది చేతిలో ఎలా మోసపోతున్నారు, మోసం చేసే వారికి శిక్ష ఉంటుంది అనేది సినిమాలో చూపించబోతున్నాం. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని తెలిపారు.

రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకు కథ, మాటలు, పాటలు రాసే అవకాశం ఇచ్చిన షెరాజ్ మెహదీకి థ్యాంక్స్. డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూనే హీరోగా నటించడం ఈజీ కాదు. ఆయన వల్లే ఈ సినిమా బాగా వచ్చింది. హైదరాబాద్, గోవా, చెన్నై పరిసర ప్రాంతాల్లో దాదాపు 45 రోజులు షూట్ చేసాము అని తెలిపారు.