Jagapathi Babu : జగ్గూ భాయ్ సింప్లిసిటీ చూశారా..!

జగపతి బాబు తన డ్రైవర్, అసిస్టెంట్‌తో కలిసి హైవే పక్కన హోటల్‌లో భోజనం చేశారు..

Jagapathi Babu : జగ్గూ భాయ్ సింప్లిసిటీ చూశారా..!

Jagapathi Babu

Updated On : July 29, 2021 / 5:24 PM IST

Jagapathi Babu: విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతి బాబు కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ నెగెటివ్ క్యారెక్టర్లు చేస్తూ బిజీ అయిపోయారు. ‘సముద్రం’ పేరుతో తన రియల్ లైఫ్ విషయాలను బోల్డ్‌గా షేర్ చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేశారు.

Jagapathi Babu

ఈమధ్య ‘FCUK (ఫాదర్ – చిట్టి – ఉమా- కార్తీక్)’ సినిమాలో ప్లేబాయ్ క్యారెక్టర్‌తో అదరగొట్టేశారు. ఎప్పటికప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌తో షేర్ చేస్తుంటారు జగ్గూ భాయ్. ఇప్పుడాయన పోస్ట్ చేసిన పిక్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

హైవే మీద జర్నీ చేస్తూ తమిళనాడులోని, దిండికల్ ఏరియాలో రోడ్ పక్కన ఆగి ఓ హోటల్‌లో తన డ్రైవర్, అసిస్టెంట్‌తో కలిసి భోజనం చేశారు జగపతి బాబు. ‘చాలా రోజుల తర్వాత నా డ్రైవర్ రాజు, అసిస్టెంట్ చిరుతో కలిసి ఇలా హైవే పక్కన భోజనం చేశాను’.. అంటూ వాళ్లతో కలిసి తీసుకున్న సెల్ఫీని తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్ చేశారు జగపతి బాబు.
‘జీవితాన్ని చాలా దగ్గరగా చూశారు.. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూశారు కాబట్టే ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు.. గ్రేట్.. మీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ జగ్గూ భాయ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.