Jagapathi Babu : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో జగ్గూ భాయ్ లంచ్

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో కలిసి చెన్నైలోని ఓ లోకల్ హోటల్‌లో భోజనం చేశారు జగపతి బాబు..

Jagapathi Babu

Jagapathi Babu: సీనియర్ నటుడు, స్టైలిష్ విలన్‌గా అలరిస్తున్న జగపతి బాబు ఇటీవల కొద్ది రోజులు అమెరికాలో గడిపారు. అక్కడ సామాన్యుడిలా సూపర్ మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తేవడం, కుకింగ్ చెయ్యడం, బుక్స్ చదవడం, పెట్‌తో ఆడుకోవడం.. ఇలా సందడి చేస్తున్న పిక్స్ అన్నిటినీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అలాగే ఇప్పుడు జగ్గూ భాయ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పిక్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పని మీద చెన్నై వెళ్లిన జగపతి బాబును అక్కడుండే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిశారు. వారి కోరిక మేరకు ఓ లోకల్ హోటల్‌లో వారితో కలిసి లంచ్ చేశారాయన.

జగపతి బాబు సినిమాల గురించి, తమ అభిమాన నటుడితో కలిసి చేసిన ‘నాన్నకు ప్రేమతో’, ‘అరవింద సమేత’ చిత్రాల్లో జగపతి బాబు నటన అద్భుతం అంటూ తారక్ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని ఆయనతో షేర్ చేసుకున్నారు. వారితో తీసుకున్న ఫొటోను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్ చేశారు జగపతి బాబు.

Jagapathi Babu : జగ్గూ భాయ్ సింప్లిసిటీ చూశారా..!

కొద్ది రోజుల క్రితం హైవే మీద జర్నీ చేస్తూ తమిళనాడులోని, దిండికల్ ఏరియాలో రోడ్ పక్కన ఆగి ఓ హోటల్‌లో తన డ్రైవర్, అసిస్టెంట్‌తో కలిసి భోజనం చేశారు జగ్గూ భాయ్. చెంచు మామగా జగపతి బాబు నటించిన ‘మహా సముద్రం’ అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన క్యారెక్టర్‌కు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వస్తుంది.

Maha Samudram : రివ్యూ