Vishnu Manchu : మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో.. అల్లు అర్జున్ ని కలిసిన మంచు విష్ణు..

తాజాగా మంచు విష్ణు కూడా అల్లు అర్జున్ ను కలవడానికి వచ్చాడు.

Actor manchu vishnu met Icon star allu arjun at his residence

Vishnu Manchu : సంధ్య థియటర్ ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ అరెస్ట్ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో చెప్పనవసరం లేదు. దాదాపు 13 గంటల పాటూ బన్నీ జైలులోనే ఉండాల్సి వచ్చింది. శనివారం ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయి ఇంటికి వచ్చాడు. అల్లు అర్జున్ అరెస్ట్ తో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా తలకిందులైనట్టు అయ్యింది. అనంతరం తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటి ముందు ప్రత్యక్షమైంది.

ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుండి బుల్లితెర నటుడు సుడిగాలి సుధీర్ వరకు చాలా మంది సినీ సెలెబ్రిటీస్ అల్లు అర్జున్ ను కలవడానికి వచ్చారు. ఇందులో భాగంగానే తాజాగా మంచు విష్ణు కూడా అల్లు అర్జున్ ను కలవడానికి వచ్చాడు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కాసేపు కూర్చొని మాట్లాడారు మంచు విష్ణు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Also Read : Taapsee Pannu : నా పెళ్లి ఇప్పుడు కాదు ఎప్పుడో అయిపోయింది.. కానీ.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన తాప్సి

మరో వైపు గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంచు బ్రదర్స్ అలాగే మంచు మోహన్ బాబుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి.. ఇంట్లో నాలుగు గోడల మధ్య మొదలైన ఆస్తుల పంచాయతీ, అన్నాదమ్ముల మధ్య విబేధాలు పోలీసు స్టేషన్ వరకు చేరాయి. అంతేకాదు. పోలీసు స్టేషన్ వరకు వెళ్లడమే కాదు ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. అలా మంచు ఫ్యామిలీలో ఇన్ని గొడవల నేపథ్యంలో మంచు విష్ణు అల్లు అర్జున్ ను కలవడానికి వెళ్లడంతో ఈ విషయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.