Actor Nandu : స్టేజిపై ఏడ్చేసిన నందు.. నాకు సంబంధం లేకపోయినా నా గురించి వార్తల్లో అలా..

తాజాగా ఢీ షో కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో హైపర్ ఆది.. గీతామాధురిని ఉద్దేశించి నందుతో మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదైనా ఒక ఎమోషనల్ మూమెంట్ గురించి చెప్పమని అడిగాడు.

Actor Nandu : నటుడు నందు సెకండ్ హీరోగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరో వైపు క్రికెట్ మ్యాచ్ లకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కి కూడా యాంకరింగ్ చేస్తూనే ఇటీవల డ్యాన్స్ షో ఢీలోకి వచ్చి యాంకరింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం నందు కెరీర్ లో సినిమాలు, సిరీస్ లు, యాంకరింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఇక నందు భార్య సింగర్ గీతామాధురి అని తెలిసిందే.

తాజాగా ఢీ(Dhee) షో కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇది వాలెంటైన్ వీక్ కావడంతో షోలో కూడా వాలెంటైన్స్ స్పెషల్ ఎపిసోడ్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో హైపర్ ఆది.. గీతామాధురిని ఉద్దేశించి నందుతో మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదైనా ఒక ఎమోషనల్ మూమెంట్ గురించి చెప్పమని అడిగాడు.

నందు దీనికి సమాధానమిస్తూ.. నా మీద ఒక రూమర్ వచ్చింది. నాకు ఎటువంటి సంబంధం లేని ఒక విషయంలో నా పేరు లాగి న్యూస్ లో బాగా రిపీట్ చేశారు. 12 రోజుల పాటు నన్ను వార్తల్లో నెగిటివ్ గా హైలెట్ చేస్తూ చూపించారు. కానీ తర్వాత దానికి సంబంధం లేదని తెలిసాక సింపుల్ గా ఒక స్క్రోలింగ్ లో వేశారు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను అంటూ స్టేజిపై ఎమోషనల్ అయి ఏడ్చాడు. అయితే దాని వల్ల నందుకు, గీత మధురికి మధ్య ఏదైనా జరిగి ఉంటుందని తెలుస్తుంది. నందు ఏం చెప్పాడో పూర్తిగా తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

ఇక నందు మాట్లాడింది గతంలో జరిగిన డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసు ఇష్యూ గురించి అని తెలుస్తుంది. గతంలో ఓ డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో నందు పేరు కూడా వినిపించింది. అయితే ఆ తర్వాత ఇందులో నందుకు ఎలాంటి సంబంధం లేదని కూడా వచ్చింది. దాని గురించే నందు ఇప్పుడు మాట్లాడి బాధపడ్డాడు అని తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు