పడిపోలేదు.. ఆ వార్తలు అబద్ధం.. హాస్పిటల్‌లో నర్సింగ్ యాదవ్

  • Publish Date - April 10, 2020 / 02:44 AM IST

టాలీవుడ్ సీనియర్ నటులు నర్సింగ్  యాదవ్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఒక్కసారిగా కోమాలోకి వెళ్లారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

ప్రస్తుతం ఆయన పరిస్థితి  సీరియస్‌గా ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇంట్లో నాలుగు గంటల సమయంలో సడెన్‌గా పడిపోవడంతో, తీవ్ర గాయాలు అయ్యినట్లు వస్తున్న వార్తలను నర్సింగ్ యాదవ్ భార్య ఖండించారు. వెంటిలేటర్ మీద ఆయనకు చికిత్స అందుతుందని చెప్పారు. 

సోమాజిగూడ యశోద ఆస్పత్రి తరలించగా.. 48 గంటల పాటు అబ్జర్‌వేషన్‌లో ఉంచినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎవరూ నమ్మకండి. క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండి అని భార్య చిత్రయాదవ్ కోరారు.

కమెడియన్‌గా, విలన్‌గా అనేక పాత్రలలో నటించిన నర్సింగ్ యాదవ్.. రామ్ గోపాల్ వర్మ చిత్రాలలో రెగ్యులర్‌గా ఉండే నటులలో ఒకరు. అనేక భాషల్లో ఆయన నటించారు.