×
Ad

Nikhil Siddhartha : ఏపీలో థియేటర్ల పరిస్థితిపై గళమెత్తిన మరో యంగ్ హీరో..

థియేటర్లు మాకు దేవాలయాల్లాంటివి - యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ..

  • Published On : December 26, 2021 / 01:43 PM IST

Nikhil

Nikhil Siddhartha: సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఊహించని విధంగా టికెట్ రేట్లు తగ్గించడంతో పాటు బెన్‌ఫిట్ షోలకు, ఎలాంటి స్పెషల్ షోలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పడంతో కొత్త సినిమాల విడుదల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది..

Vijay Deverakonda : తెలంగాణ సర్కార్ ఇండస్ట్రీ బాగును కోరుకుంటోంది..

క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సీజన్‌లో పెద్ద మొత్తంలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఆశించిన నిర్మాతలు, థియేటర్ల యజమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇటీవల యంగ్ హీరో నాని ఈ అంశం గురించి చేసిన వ్యాఖ్యలపై పలువురు ఏపీ రాజకీయనాయకులు విమర్శలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా యంగ్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ కూడా ఈ విషయం గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిఖిల్ థియేటర్‌ను రైలుతో పోల్చడం విశేషం.. జనరల్, ఏసీ లగ్జరీ కోచ్ లాగే.. థియేటర్‌లోనూ లగ్జరీ టికెట్ ఉండాలన్నారు.

Anil Ravipudi : ఏపీ థియేటర్స్ విషయంలో అయోమయంగా ఉంది..

‘ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో 20 రూపాయల టికెట్ సెక్షన్ కూడా ఉంది.. సినిమా థియేటర్లు ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ టికెట్ రేట్‌తో బాల్కనీ/ప్రీమియం విభాగాన్ని (ట్రైన్ మాదిరిగా) అనుమతించమని అధికారులకు నా అభ్యర్థన. థియేటర్లు మాకు దేవాలయాల్లాంటివి.. ప్రజలకు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తాయి. ఏపీలో థియేటర్లు మూతపడడం బాధాకరం.. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను ఆదరిస్తున్నందుకు సంతోషం మరియు కృతజ్ఞతలు.. అదే విధంగా థియేటర్లకు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ నిఖిల్ ట్వీట్ చేశారు.