×
Ad

Parineeti Chopra Baby Boy: పండుగ వేళ.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు.

Parineeti Chopra Baby Boy: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా దంపతులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సంతోషకరమైన వార్తను ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘చివరకు మా బేబీ బాయ్ వచ్చేశాడు. మా చేతులు, హృదయాలు మరింతగా నిండిపోయాయి. మొదట మేమిద్దరం ఉన్నాం, ఇప్పుడు మాకు సర్వస్వం లభించింది’ అంటూ వారు ఎమోషన్ అయ్యారు.

‘మేము ఎదురుచూసిన మా కలల కుమారుడు.. ఈరోజు మా ఒడిలోకి వచ్చాడు. అతడి రాకతో మా చేతులు నిండుగా ఉన్నాయి. హృదయాలు మరింత నిండుగా ఉన్నాయి. ఈ క్షణం మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మొదట మేము ఒకరికొకరంగా ఉన్నాం. ఇప్పుడు మా సర్వస్వం వీడే. మీ అందరికీ కృతజ్ఞతలతో.. పరిణీతి, రాఘవ్’ అని ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది సెలబ్రిటీ కపుల్.

తొలిసారి పేరెంట్స్ అయిన పరిణీతి, రాఘవ్ దంపతులకు అభిమానులు, పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రసవం కోసం పరిణీతి ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు. ఆదివారం ఉదయం ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఆమెకు ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. లండన్‌లో చదువుకునే రోజుల్లో మొదలైన వీరి స్నేహం తర్వాత ప్రేమగా మారి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత పరిణీతి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

Also Read: మహేష్-రాజమౌళి మూవీ క్రేజీ అప్డేట్.. టైటిల్ గ్లింప్స్ డేట్ ఇదే.. హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్