SSMB 29: మహేష్-రాజమౌళి మూవీ క్రేజీ అప్డేట్.. టైటిల్ గ్లింప్స్ డేట్ ఇదే.. హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్

ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న ఏకైక మూవీ ఏదైనా ఉందంటే (SSMB 29)అది మహేష్ బాబు-రాజమౌళి మూవీ అనే చెప్పాలి. గ్లోబల్ ట్రాటర్ ట్యాగ్ తో హోలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

SSMB 29: మహేష్-రాజమౌళి మూవీ క్రేజీ అప్డేట్.. టైటిల్ గ్లింప్స్ డేట్ ఇదే.. హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్

Mahesh Babu-Rajamouli Movie Title Glimpse Releasing on November 16th

Updated On : October 19, 2025 / 11:06 AM IST

SSMB 29: ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న ఏకైక మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్ బాబు-రాజమౌళి మూవీ అనే చెప్పాలి. గ్లోబల్ ట్రాటర్ ట్యాగ్ తో హోలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (SSMB 29)అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఈ సినిమా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవడం లేదు. రాజమౌళి కూడా ఈ సినిమా కోసం ఏకంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖ సంస్థలు పని చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14 భాషలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రూ.10,000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Ntr: ఎన్టీఆర్ కి గెస్ట్ సెంటిమెంట్.. ఫ్యాన్స్కి ఇక టెన్షన్ తప్పినట్టే.. ఇకముందు కూడా..

అయితే, ఈ భారీ ప్రాజెక్టు గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ను నవంబర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి నవంబర్ మంత్ ఎప్పుడు వస్తుందా అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, నవంబర్ 16న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల చేయనున్నారట మేకర్స్. ఆ ఈవెంట్ కూడా హాలీవుడ్ లెవల్లో భారీ ఎత్తున చేయనున్నారని టాక్.

ఈ ఒక్క ఈవెంట్ తో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చర్చనీయాంశం కావాలని టీం ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన చేయనున్నారట. ఇక ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న టాక్ మేరకు మహేష్-రాజమౌళి సినిమాకు “వారణాసి” అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారట. ఈ సినిమాలో మెయిన్ పాంట్ వారణాసి ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉంటుందట. అలాగే, డివోషనల్ ఎలిమెంట్స్ కి చాలా స్కోప్ ఉండనుందట. అందుకే ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలనీ చూస్తున్నారట. మరి ఇంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తరువాత ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.