Ntr: ఎన్టీఆర్ కి గెస్ట్ సెంటిమెంట్.. ఫ్యాన్స్కి ఇక టెన్షన్ తప్పినట్టే.. ఇకముందు కూడా..
సినిమా ఇండస్ట్రీలో చాలా రకాల సెంటిమెంట్లు ఉంటాయి. చాలా మంది స్టార్ హీరోలు కూడా(Ntr) సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. సినిమా మొదలు, సినిమా విడుదల ఇలా ప్రతీ విషయంలో సెంటిమెంట్ ను ఫాలో అవడం మనం చూస్తూనే ఉంటాం.

Star hero NTR breaks guest sentiment with kantara: chapter 1
Ntr: సినిమా ఇండస్ట్రీలో చాలా రకాల సెంటిమెంట్లు ఉంటాయి. చాలా మంది స్టార్ హీరోలు కూడా సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. సినిమా మొదలు, సినిమా విడుదల ఇలా ప్రతీ విషయంలో సెంటిమెంట్ ను ఫాలో అవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, కొన్నిసార్లు పాజిటీవ్ రియాక్షన్ ఇస్తే కొన్నిసార్లు నెగిటీవ్ రియాక్షన్ ఇస్తుంది. అలాంటి నెగిటీవ్ సెంటిమెంట్ ఒకటి ప్రస్తుతం ఎన్టీఆర్ ను వెంటాడుతోంది. అదే గెస్ట్ సెంటిమెంట్. అవును, ఎన్టీఆర్(Ntr) ఈమధ్య కాలంలో గెస్ట్ గా వెట్టిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.
Zaira Wasim Marriage: పెళ్లి చేసుకున్న దంగల్ బ్యూటీ జైరా వసీమ్.. వరుడు ఎవరో తెలుసా?
అందులో ముందుగా చెప్పుకోవాల్సింది విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన దాస్ కా ధమ్కీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. కానీ, విడుదల తరువాత మాత్రం ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తరువాత ఎన్టీఆర్ గెస్ట్ గా కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అర్జున్ సన్ అఫ్ వైజయంతి సినిమాకు హాజరయ్యారు. ఈ సినిమా కూడా ప్లాప్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే, ఈ సెంటిమెంట్ చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. అయితే, ఇటీవలే ఈ సెంటిమెంట్ కి బ్రేక్ పడింది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ గెస్ట్ గా ఇటీవల కాంతార: చాఫ్టర్ 1 సినిమాకు వెళ్ళాడు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో, ఎన్టీఆర్ కి గెస్ట్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తా, వార్ 2తో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తనఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కనడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.