×
Ad

Priyadarshi: జాతిరత్నాలు 2లో నేను చేయను.. ఇప్పుడు కష్టం.. మిత్రమండలి అంతకు మించి..

జాతిరత్నాలు.. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. (Priyadarshi)కరోనా లాంటి కష్టకాలం తరువాత ఆడియన్స్ కు సూపర్ రిలీఫ్ ఇచ్చిన సినిమా ఇది.

Actor Priyadarshi says he will not do Jathiratnalu 2

Priyadarshi: జాతిరత్నాలు.. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా లాంటి కష్టకాలం తరువాత ఆడియన్స్ కు సూపర్ రిలీఫ్ ఇచ్చిన సినిమా ఇది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ ఛిచ్చోరె సినిమా ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్స్ అన్నీ లాఫింగ్ క్లబ్స్ గా మారిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఎలాంటి డబుల్ మీనింగ్(Priyadarshi) డైలాగ్స్ లేకుండా, ఎటువంటి వల్గారిటీ లేకుండా ఈ సినిమాను చేసి ఆడియన్స్ కు ఫుల్లుగా నవ్వించాడు దర్శకుడు అనుదీప్ కేవీ.

Bahubali: The Epic: బాహుబలి ఎపిక్ లో అలాంటివి ఏమీ ఉండవు.. ఆశలు పెట్టుకోకండి.. షాకిచ్చిన నిర్మాత

కేవలం రూ.6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే, ఈ సినిమా టీవీలో వచ్చినా మిస్ అవకుండా చూసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా జాతిరత్నాలు 2 కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు దర్శకుడు అనుదీప్. అయితే, తాజాగా జాతిరత్నాలు 2పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఈ సినిమాలో కీ రోల్ చేసిన ప్రియదర్శి. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ మిత్ర మండలి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు విజయేందర్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియదర్శి జాతిరత్నాలు 2లో నేను చేయను అంటూ చెప్పుకొచ్చాడు. “ఇప్పుడు జాతిరత్నాలు-2 సినిమా తీస్తే నేను మాత్రం అస్సలు చేయను. అలాంటి క్లాసిక్‌ సినిమాను మళ్లీ తీయొచ్చేమో కానీ.. నేను మాత్రం ఆ సినిమాలో నటించను”అంటూ స్పష్టం చేశాడు ప్రియదర్శి. ఇక మిత్ర మండలి సినిమా గురించి మాట్లాడిన ఆయన “ఈ సినిమా కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే చేసింది. జాతిరత్నాలు సినిమాకు మించి మీరు ఎంజాయ్ చేస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.