David Warner : నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడం విశేషం. కాగా, డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
స్టేజ్ పైనే అందరి ముందే.. డేవిడ్ వార్నర్ ని తిట్టేశారు రాజేంద్ర ప్రసాద్. రేయ్ అంటూ వార్నర్ ను సంబోధించారాయన. అంతేకాదు క్రికెట్ ఆడవయా అంటే యాక్టింగ్ చేస్తున్నావా.. నువ్వు పెద్ద దొంగ.. మామూలోడు కాదండి వీడు.. అంటూ వ్యాఖ్యానించారు. అయితే, రాజేంద్రప్రసాద్ సరదాగానే ఇలా మాట్లాడారు.
”48 ఏళ్లుగా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటికీ ఉండటానికి కారణం మైత్రీ మూవీస్ నా సొంత కంపెనీ లాంటిది. నవీన్, రవి వీళ్లంతా నా బిడ్డలు. నేను ఫస్ట్ శ్రీమంతుడిలో యాక్ట్ చేశా. ఇవాళ రాబిన్ హుడ్ లో నటించా. ఇవాళ మీ అందరి ముందు నిలబడి మాట్లాడే అర్హత నాకు ఉంది.. ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది.
Also Read : నితిన్ “రాబిన్ హుడ్” సినిమా ట్రైలర్ విడుదల.. డేవిడ్ వార్నర్ లాలీపాప్ తింటూ..
రాబిన్ హుడ్ సినిమా హాయిగా ఫ్యామిలీతో ఏసీ థియేటర్ లో కూర్చుని చూసే సినిమా. చాలాకాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది. అలా మీకు కలగటానికి కారణం వెంకీ కుడుముల. ఈ క్రెడిట్ అంతా నేను తనకిస్తాను. మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పదలుచుకున్నా.
నితిన్ ఒక అద్భుతమైన హీరో. ఒక అద్భుతమైన రొమాంటిక్ రోల్స్ నుంచి ఒక అద్భుతమైన కమర్షియల్ స్టెప్ లోకి వెళ్లబోతున్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్ హీరోగా వేరే మాదిరిగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఒక మంచి కధతో నేను, వెన్నెల కిశోర్ పాత్రలు చేశాం. మా పాత్రలను మీరు గుర్తు పెట్టుకుంటారు. అక్కడ మీతో నేను డ్యాన్స్ వేపిస్తా. ప్రతి ఇంట్లోనూ రాబిన్ హుడ్ లాంటి ఒక దొంగ ఉండాలి అనుకునే అద్భుతమైన కథలో ఒక మంచి కామెడీ ఎంటర్ టైన్ మెంట్ చూసినప్పుడు సమ్మర్ పోతుంది. మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అని రాజేంద్రప్రసాద్ అన్నారు.