Rajendraprasad
Puneeth Rajkumar: కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చిన్న కుమారుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ సోదరుడు.. పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు అనే మాట నమ్మబుద్ధి కావడం లేదు. పునీత్ మరణంతో షాక్‌కి గురై అభిమానులు గుండె పోటుతో మరణించడం బాధాకరం. గురువారం నాడు కంఠీరవ స్టూడియోలోని పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
Hyd to Mumbai : సోనూ సూద్‌ను కలవడానికి చెప్పులు లేకుండా..700 కిలోమీటర్లు నడక
పునీత్‌ను చివరిసారి చూడలేక పోయిన నాగార్జున, రామ్ చరణ్ వంటి పలువురు టాలీవుడ్ ప్రముఖులు బెంగుళూరులోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. శుక్రవారం నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, పునీత్ నివాసానికి వెళ్లారు. పునీత్ రాజ్ కుమార్‌కి నివాళులు అర్పించారు.
చిన్న వయసులో పునీత్ దూరమవ్వడం బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, పునీత్ కుటుంబం ఈ బాధ నుండి త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి వేడుకుంటున్నట్లు తెలిపారు. పునీత్ భార్యకు ధైర్యం చెప్పారు. పునీత్ రెండో అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్‌తో మాట్లాడారు.