Sarath Kumar : సీనియర్ నటుడు శరత్ కుమార్‌కు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు..
తాజాగా ఇవాళ ఉదయం శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. డయేరియాతో డీహైడ్రేషన్ కి గురైనట్టు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం.............
- Saketh U
- Published On : December 11, 2022 / 11:27 AM IST
Actor Sarath Kumar fell seriously ill joined in hospital
Sarath Kumar : ప్రముఖ సీనియర్ నటుడు, నటి రాధిక భర్త శరత్ కుమార్ ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకి గురవ్వడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్చారు. నటుడు శరత్ కుమార్ హీరోగా, సపోర్టింగ్ రోల్ లో తెలుగు, తమిళ్, మలయాళంలో అనేక సినిమాలతో మెప్పించారు. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉన్నారు శరత్ కుమార్.
Venky Atluri : సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్
తాజాగా ఇవాళ ఉదయం శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. డయేరియాతో డీహైడ్రేషన్ కి గురైనట్టు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయనకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భార్య రాధిక, కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇప్పటికే హాస్పిటల్ వద్దకు చేరుకున్నట్టు సమాచారం.
