Suvikshit : క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్ చనిపోతారు.. అయినా హ్యాపీ ఎండింగ్..
దూరదర్శిని సినిమా మే 15న రిలీజ్ కానుంది. (Suvikshit)
- Saketh U
- Published on- May 13, 2026 / 02:14 PM IST
Suvikshit
Suvikshit : సువిక్షిత్, గీతికా రతన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని అనేది ట్యాగ్ లైన్. వారాహ మూవీ మేకర్స్ బ్యానర్ పై జయశంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ నిర్మాణంలో కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దూరదర్శిని సినిమా మే 15న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా హీరో సువిక్షిత్ నేడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ అని చెప్తూ.. రచయిత నారాయణ అరుణాచలంలో కలిసిన ఓ యాచకుడి జీవితకథ ఆధారంగా ఈ కథను అనుకుని రాసుకున్నారు. మొదట వేరే హీరోతో చేద్దామని ప్లాన్ చేశాం కానీ కథకు కొత్తవాళ్ళైతే బాగుంటుంది అనుకోవడంతో నాకున్న ఇంట్రెస్ట్‌తో నేనే చేశాను అని తెలిపారు.
Also Read : Vijay : విజయ్ కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.. ఫిట్నెస్ ట్రైనర్ కామెంట్స్..
ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 90s బ్యాక్ డ్రాప్‌లో నడిచే కథ ఇది. నేను ఈసినిమాలో ప్రత్యేకంగా నటించలేదు. జస్ట్ ఆ టైమ్‌లో ఎలా ఉండేవాళ్ళో అలా బిహేవ్ చేశాను. ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే. సహజత్వం కోసం కొత్తవాళ్లతో సినిమా చేసాము. ప్రతి సినిమాకు ఉండే కష్టాలు మాకు కూడా ఉన్నాయి. ఈ సినిమాను క్వాలిటీ కోసం బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వటానికి మూడేళ్లు టైమ్ తీసుకున్నాం. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ చనిపోతారు అయినా చివర్లో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. చనిపోయిన తరువాత హ్యపీ ఎండింగ్ ఎలా ఇచ్చాం. అసలు అరుణాచలంలోకి ఆ పెద్దాయన ఎలా వచ్చాడు? ఆయన జీవితంలో జరిగింది ఏమిటి అనేది కథ. యానాం, కాకినాడ, అమలాపురం పరిసర ప్రాంతాల్లో చాలా నేచురల్ లోకేషన్స్‌లో 90వ దశకం గుర్తొచ్చేలా ఈ సినిమా తీశాం అని అన్నారు.
సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. మేము వంద థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే చాలు అనుకున్నాం కానీ ఇప్పడు దాదాపు 250పైగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. సిటీకి అలవాటు పడి అందరం మన మూలాలను, పల్లెట్లూర్లను మర్చిపోతున్నాం. ఈ సినిమా చూసిన వారికి వాళ్ల సొంతూరు గుర్తుకొస్తుంది. ఈ సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ ఎమోషన్ చూసి ఏడ్వకుండా ఎవ్వరూ ఉండలేరు అని అన్నారు.
Also Read : IBomma: సినీ ఇండస్ట్రీకి బిగ్ షాక్.. మళ్లీ వచ్చేసిన ‘ఐబొమ్మ’.. లిస్టులో కొత్త సినిమాలు
