Viswa Karthikeya : రామా క్రియేషన్స్, నాని మూవీ వర్క్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సెట్స్‌పై.. హీరో విశ్వ కార్తికేయ బర్త్ డే వేడుకలు

బాలనటుడిగా కెరీర్ ఆరంభించిన విశ్వ కార్తికేయ(Viswa Karthikeya) ఇప్పుడు హీరోగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు.

Viswa Karthikeya birthday celebrations

Viswa Karthikeya Birthday : బాలనటుడిగా కెరీర్ ఆరంభించిన విశ్వ కార్తికేయ(Viswa Karthikeya) ఇప్పుడు హీరోగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. నటసింహం బాలకృష్ణ, బాపు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లాంటి గొప్ప న‌టుల‌తో న‌టించిన అనుభ‌వం ఆయ‌న సొంతం. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. అందులో రామా క్రియేషన్స్ అండ్ నాని మూవీ వర్క్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ ఒక‌టి. రమాకాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఆయుషి పటేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

సస్పెన్స్ త్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఇటీవ‌లే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. విశ్వ కార్తికేయ పుట్టిన రోజు వేడుక‌ను రామా క్రియేషన్స్, నాని మూవీ వర్క్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ యూనిట్ ఘ‌నంగా నిర్వ‌హించింది.

Bharateeyans : చైనాకు వత్తాసు పలకడం ఎవరైనా సమర్థించగలరా..? మా సినిమాకు మ‌ద్ద‌తు ఇవ్వండి.. భారతీయన్స్ నిర్మాత

విశ్వ కార్తికేయ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుమారు 50కి పైగా సినిమాల్లో న‌టించారు. ఆ నలుగురు చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నంది అవార్డు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, స్టేట్ అవార్డు ఫర్ మెరిటోరియస్ అచివేమెంట్ లాంటి ఎన్నో అచీవ్‌మెంట్స్ సొంతం చేసుకున్నారు. జైసేన, కళాపోషకులు, ఐపిఎల్, అల్లంతదూరన అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ మెప్పు పొందాడు.

ప్ర‌స్తుతం విశ్వ కార్తికేయ.. రామా క్రియేషన్స్, నాని మూవీ వర్క్స్ ప్రొడక్షన్ నెంబర్ 1తో పాటు పాన్ ఇండియన్ సినిమా ఎన్త్ హవర్ సినిమాలు చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అడ్వెంచర్ గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అతి త్వరలో ఈ చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు.

Bandla Ganesh : ప‌వ‌ర్‌స్టార్‌కు బండ్ల గ‌ణేష్ ప్రామిస్‌.. సాయంగా ఉంటా.. లేదంటే దూరంగా ఉంటా.. అంతేగాని ప‌వ‌న్ పేరు చెప్పుకుని..