Mana ShankaraVaraprasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’పై గుసగుసలు..
మెగా 157 మూవీకి మన శంకరవరప్రసాద్ గారు (Mana ShankaraVaraprasad Garu) అనే టైటిల్ కన్ఫామ్ చేశారు.

Gossip Garage Mana ShankaraVaraprasad Garu Chiranjeevi Anil Ravipudi
Mana ShankaraVaraprasad Garu : సక్సెస్‌కు కేరాఫ్‌గా మారిపోయిన అనిల్ రావిపూడి.. వరుస హిట్‌లతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరు బర్త్‌డే కానుకగా.. సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు.
మెగా 157 మూవీకి మన శంకరవరప్రసాద్ గారు (Mana ShankaraVaraprasad Garu) అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. టైటిల్ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మెగాస్టార్‌కు వింటేజ్ టచ్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. స్టైలిష్ చిరంజీవిని ఫ్యాన్స్‌కు ప్రజెంట్ చేశాడు. చిరు స్వాగ్.. ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది.
BEAUTY : అంకిత్ కొయ్య ‘బ్యూటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలోకి ఎప్పుడంటే..?
ఈ గ్లింప్స్.. చిరంజీవి రియల్ నేమ్‌కి సంబంధం ఉన్న టైటిల్‌తో ఎమోషనల్ టచ్‌ని అందించింది. చిరు స్టైలిష్ లుక్, బాడీ లాంగ్వేజ్ అభిమానులను మెస్మరైజ్ చేస్తుండగా పండగకి వస్తున్నారు అనే ట్యాగ్‌లైన్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ గ్లింప్స్‌కి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందించడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
సినిమాలో మరో సర్‌ప్రైజ్ ఉందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయ్. వెంకటేష్ కేవలం వాయిస్ ఓవర్‌తోనే కాకుండా… ఓ స్పెషల్ కామియోలో కనిపించనున్నారని టాక్. ఫుల్ ఎనర్జీతో, ఫన్ ఎలిమెంట్స్‌తో ఈ పాత్ర ఉంటుందని… అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఏ మాత్రం తగ్గదనే గాసిప్స్ వినిపిస్తున్నాయ్. వెంకీ, చిరు కాంబినేషన్ సీన్స్.. థియేటర్స్‌లో పండగ వాతావరణం తీసుకురావడం ఖాయం అని అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు.
2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా.. బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే మరో ఇంట్రస్టింగ్ గాసిప్ కూడా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ మాస్ సాంగ్ కోసం మెగాస్టార్ తనయుడు రాంచరణ్ స్వరం అందించబోతున్నారని టాక్. ఈ సాంగ్ పక్కా మాస్ నంబర్‌గా ఉంటుందని.. చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్‌తో థియేటర్స్ ఊగిపోవడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయ్. ఈ పాట.. సినిమాకే హైలైట్‌గా నిలిచి.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయమట. రాంచరణ్ యాక్టింగ్‌కు చూశాం.. ఫిదా అయ్యాం.. ఆయన సింగిగ్ టాలెంట్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఇప్పటినుంచే డిస్కషన్ స్టార్ట్ చేశారు.