Abhinaya : మెగాస్టార్, గ్లోబల్ స్టార్ తో హీరోయిన్ ఫొటో.. భర్తతో కలిసి లండన్ లో మీట్.. ఫొటో వైరల్..

రామ్ చరణ్, చిరంజీవి ఫ్యామిలీలతో ప్రస్తుతం లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Actress Abhinaya Shares Photo with Ram Charan and Megastar Chiranjeevi from London

Abhinaya : రామ్ చరణ్, చిరంజీవి ఫ్యామిలీలతో ప్రస్తుతం లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే. లండన్ లో చరణ్ మైనపు విగ్రహం లాంచ్, RRR ప్రత్యేక ప్రదర్శన ఉండటం, వాటితో పాటు వెకేషన్ కి కలిసి ఫ్యామిలీ అంతా లండన్ వెళ్లారు. చిరు, చరణ్ ఫ్యామిలీతో లండన్ లో తిరుగుతున్న పలు ఫోటోలు ఇటీవల లీక్ అయ్యాయి.

అయితే తాజాగా నటి అభినయ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి లండన్ లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమిళ్, తెలుగులో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలతో మెప్పించిన నటి అభినయ ఇటీవల ఏప్రిల్ 16న తన ప్రియుడు కార్తీక్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి అనంతరం వీరు హనీమూన్ కి లండన్ వెళ్లారు.

Also Read : Chiranjeevi : ఊటీలో చలికాలంలో బట్టలు లేకుండా.. సినిమా కోసం చిరంజీవి సాహసం..

అక్కడ చిరంజీవి ఫ్యామిలీ కనపడటంతో ఈ కొత్త జంట చిరు, చరణ్ లతో కలిసి స్పెషల్ ఫొటో దిగారు. ఈ ఫోటోని అభినయ తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఫైర్ సింబల్స్ పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో వైరల్ అవ్వగా మెగా ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Rajamouli : భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ.. అలా చేయొద్దు అంటూ రాజమౌళి ట్వీట్..