Rajamouli : భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ.. అలా చేయొద్దు అంటూ రాజమౌళి ట్వీట్..

తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ పరిస్థితులపై సీరియస్ గా స్పందిస్తూ ట్వీట్ చేసారు.

Rajamouli : భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ.. అలా చేయొద్దు అంటూ రాజమౌళి ట్వీట్..

Rajamouli Tweet on India Pakistan Situations goes Viral

Updated On : May 9, 2025 / 3:58 PM IST

Rajamouli : భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వార్ అప్డేట్స్ అంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితులపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ పరిస్థితులపై సీరియస్ గా స్పందిస్తూ ట్వీట్ చేసారు.

Also Read : Vijay Deverakonda : విజయదేవరకొండ బర్త్ డే స్పెషల్.. VD14 ఫస్ట్ లుక్ రిలీజ్.. విజయ్ బాడీ అదిరిందిగా.. పోస్టర్ వైరల్..

రాజమౌళి తన ట్వీట్ లో.. మన దేశాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడుతున్న ధైర్యవంతులైన ఇండియన్ ఆర్మీకి వందనం. ఒక దేశంగా మన అందరం కలిసి నిలబడి వారి ధైర్యంతో శాంతి, ఐక్యతతో కూడిన భవిష్యత్తుని నిర్మించుకుందాం. ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఏమైనా కదలికలు గమనిస్తే, చూస్తే ఎలాంటి ఫోటోలు, వీడియోలు తీయకండి, వాటిని షేర్ చేయకండి. ఇది మీరు శత్రువులకు సహాయం చేసే ప్రమాదం ఉంది. అలాగే పుకార్లను, అసత్య వార్తలను ప్రచారం చేయకండి, శత్రువులు ఇదే కావాలనుకుంటున్నారు. ప్రశాంతంగా అప్రమత్తంగా ఉండండి అని రాసుకొచ్చారు. దీంతో రాజమౌళి ట్వీట్స్ వైరల్ గా మారాయి.

Also Read : NTR : ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి చెక్కేసిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాకు బ్రేక్..