Malvi Malhotra : ఆ నిర్మాత నన్ను మోసం చేసారు.. నటి సంచలన ఆరోపణలు
రెమ్యునరేషన్ ఎగ్గొట్టారంటూ ఓ నటి ప్రముఖ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసారు. తనలా ఎవరు మోసపోకూడదనే ఈ విషయం బయట పెట్టారట.
- Lakshmi 10tv
- Updated on- February 6, 2024 / 12:47 PM IST
Malvi Malhotra
Malvi Malhotra : ‘మిలన్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నటి మాల్వి మల్హోత్రా తెలుగులో రాజ్ తరుణ్ పక్కన హీరోయిన్‌గా చేస్తున్నారు. తాజాగా ఈ నటి బాలీవుడ్ నిర్మాత విక్రమ్ భట్ రెమ్యునరేషన్ ఎగ్గొట్టి తనను మోసం చేసారంటూ మీడియాకు చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Nimisha Sajayan : పంటపొలాల్లో చీరకట్టుతో నిమిషా సజయన్ చిరునవ్వులు..
2017 లో ‘ఉడాన్’ సీరియల్ తో బుల్లితెర ఎంట్రీ.. 2018 లో ‘మిలన్’ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన పంజాబీ భామ మాల్వి మల్హోత్రా హిందీ, మళయాళం, తమిళ సినిమాలతో పాటు తెలుగులోనూ చేస్తున్నారు. వీడియో ఆల్బమ్స్‌లోనూ నటించారు. తాజాగా హీరో రాజ్ తరుణ్ మూవీ ‘తిరగబడరా సామి’ లో మాల్వి నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ నటి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత విక్రమ్ భట్ తనను మోసం చేసారంటూ ఆరోపణలు చేశారు. విక్రమ్ నిర్మాణంలో మాల్వి ‘బర్బాద్ కర్ దియా తేరే ప్యార్ నే’ అనే వీడియో ఆల్బమ్‌లో నటించారు. అందుకు గాను విక్రమ్ భట్ రెమ్యునరేషన్ చెల్లించలేదట. తన రెమ్యునరేషన్ కోసం మెసేజ్ చేసినా, కాల్ చేసినా స్పందించలేదట. ఇతర సినిమా షూటింగ్స్‌కి సంబంధించి బిజీ షెడ్యూల్స్ ఉన్నా విక్రమ్ భట్ ఆల్బమ్ కోసం మాల్వి సమయం కేటాయించారట. విక్రమ్ స్పందించకపోవడంతో మాల్వి మౌనంగా ఉండిపోయారట.
Ariyana Glory : చిల్ బ్రో.. అంటూ వైన్ గ్లాస్‌తో అరియనా గ్లోరీ హాట్ పోజులు..
కాగా కొన్ని నెలల తర్వాత మళ్లీ విక్రమ్ భట్ మరో ప్రాజెక్టు విషయంలో మాల్విని సంప్రదించారట. అప్పుడు మాల్వి అంగీకరించలేదట. తనలా మరే నటి మోసపోకూడదనే తను ఈ విషయాన్ని వెల్లడించినట్లు మాల్వి చెప్పారట. అయితే ఈ విషయంపై విక్రమ్ భట్ కూతురు కృష్ణభట్ స్పందిస్తూ ఈ విషయంపై తనకు ఏం తెలియదన్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై విక్రమ్ భట్ ఎలా స్పందిస్తారో చూడాలి.
