Anasuya Bharadwaj : కేటీఆర్ సర్.. మరోసారి ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు : అనసూయ
Anasuya-KTR : కేటీఆర్ చేసిన ట్వీట్ పై అనసూయ స్పందించింది.
- Thota Vamshi Kumar
- Updated on- December 3, 2023 / 09:15 PM IST
Anasuya-KTR
యాంకర్, నటి అనసూయ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షోలో తనదైన యాంకరింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. కాగా..ఆమె తనకు నచ్చిన అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది అన్న సంగతి తెలిసిందే.
తాజాగా ప్రకటించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో మాత్రం తాము ఆశించిన ఫలితం రాలేదని.. అయితే రెండు సార్లు అధికారాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ పెట్టారు.
Mahesh Babu : ఏఎంబి సినిమాస్ యానివర్సరీలో మహేష్ ఫ్యామిలీ సందడి.. పిక్స్ చూశారా..?
కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పై అనసూయ స్పందించింది. బీఆర్ఎస్ మద్దతుగా పోస్ట్ చేసింది. ‘మీరు నిజమైన నాయకుడు సార్.. ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు.. బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తూ.. మీరు చేసిన అభివృద్ధి వల్ల నేను హైదరాబాద్ తో మళ్లీ ప్రేమలో పడ్డాను.. ధనవాదాలు.’ అంటూ అనసూయ ట్వీట్ చేసింది.
