తెలుగు సీనీ నటి అర్చన అక్టోబర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్‌తో నిశ్చితార్ధం జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం (నవంబర్ 11, 2019)న సంగీత్ కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటల మధ్య కాబోయే జంట కలిసి సూపర్ గా స్టెప్పులు వేశారు.
అయితే బుధవారం (నవంబర్ 13, 2019) సాయంత్రం రిసెప్షన్ ఉంటుంది. 14వ తేది తెల్లవారుజామున 1.30 గంటలకు హైదరాబాద్ లో ఘనంగా అర్చనా వివాహం జరగబోతుంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి సంగీత్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో వధూవరులు అర్చన, జగదీష్ లతో పాటు హీరో శివబాలాజీ, మధుమిత తదితరులు తమ ఆటపాటలతో సందడి చేశారు.
ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అర్చన సినిమాల విషయానికి వస్తే.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారు 40 సినిమాల్లో నటించింది. తెలుగు బిగ్ బాస్-1సీజన్ లో అర్చనా కంటెస్టెంట్ గా ఉన్న విషయం తెలిసిందే.
Actress #Archana Sangeeth Function pic.twitter.com/1dpxnJ18aY
— Hyd Movies (@hydmovies) November 11, 2019