Mahavatar Narsimha : ‘మహావతార్ నరసింహ’ 50 డేస్ కంప్లీట్.. డిలీటెడ్ సీన్ చూశారా!
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ (Mahavatar Narsimha) విడుదలై 50 రోజులు పూర్తి అయ్యాయి.

Mahavatar Narsimha movie complete 50days
Mahavatar Narsimha : అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని (Mahavatar Narsimha) తెరకెక్కించారు. జూలై 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న యానిమేటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చిత్రం విడుదలై 50 రోజులు పూరైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. దాదాపు 200కు పైగా థియేటర్లలో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని వెల్లడించింది.
50 డేస్ పూర్తి కావడంతో ఈ చిత్రంలోని డిలీటెడ్ సీన్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.340 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.