Mirai: బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్.. హనుమాన్ ను క్రాస్ చేసిన మిరాయ్.. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే?
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మిరాయ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది(Mirai). సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చింది.

Mirai crosses Hanuman's box office collection on first day
Mirai: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మిరాయ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చింది. సినిమా కథ, ప్రెజెంట్ చేసిన విధానం, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్.. ఇలా ప్రతీ విషయంలో మిరాయ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా హాలీవుడ్ రేంజ్ ఉంది అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. దాంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మిరాయ్(Mirai) గురించే చర్చ నడుస్తోంది. మొదటిరోజు కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Shivaji In Bigg Boss : మళ్ళీ బిగ్ బాస్ లో అడుగుపెట్టిన శివన్న.. కంటెస్టెంట్ గా కాదు..
ఫస్ట్‌డే కలెక్షన్స్:
మిరాయ్ సినిమా కోసం మేకర్స్ కేవలం రూ.60 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.27.20 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది హనుమాన్ సినిమాకు వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే చాలా ఎక్కువ. తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ మూవీ మొదటిరోజు దాదాపు రూ. 10 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ రికార్డును మిరాయ్ మూవీ బద్ధలు కోటేసింది. అది కూడా ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండా ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం అంటే మాములు విషయం కాదు. ఇక నార్త్ అమెరికా విషయానికి వస్తే మొదటిరోజు 7 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.6 కోట్లకు పైనే వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్ ను విడుదల చేశాడు. ఈ వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
BRAHMAND DAY 1 💥💥💥
27.20 Crores WORLDWIDE GROSS for #MIRAI ᴡɪᴛʜ ɴᴏʀᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 🔥🔥🔥
Keep showering your love on #BrahmandBlockbusterMIRAI and experience it ONLY on the Big Screens ❤️🔥❤️🔥❤️🔥
Superhero @tejasajja123
Rocking Star… pic.twitter.com/lvYrluMkZS— People Media Factory (@peoplemediafcy) September 13, 2025