Shivaji In Bigg Boss : మళ్ళీ బిగ్ బాస్ లో అడుగుపెట్టిన శివన్న.. కంటెస్టెంట్ గా కాదు..

టాలీవుడ్ నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు(Shivaji). ఒకప్పుడు హీరోగా, ఆతరువాత కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు.

Shivaji In Bigg Boss : మళ్ళీ బిగ్ బాస్ లో అడుగుపెట్టిన శివన్న.. కంటెస్టెంట్ గా కాదు..

Sivaji to host Bigg Boss Season 9 Buzz Show

Updated On : September 13, 2025 / 11:40 AM IST

Shivaji: టాలీవుడ్ నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు హీరోగా, ఆతరువాత కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. కానీ, కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. కొంతకాలం ఆంధ్ర రాజకీయాల్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అనంతరం చాలా కాలం తరువాత ఆయన తెరపై కనిపించింది అంటే బాగ్ బాస్ లో అనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 7లో ఆయన కంటెస్టెంట్ గా వచ్చిన ఏ రేంజ్ లో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశాడో ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఎత్తులతో, స్ట్రాటజీలతో బిగ్ బాస్ ను సైతం భయపెట్టేశాడు.

Balakrishna-Gopichand: చారిత్రక కథ, యాక్షన్ బ్యాక్డ్రాప్.. బాలయ్య సరికొత్త అవతార్.. దసరాకి స్టార్ట్?

ఈ షో ద్వారా మళ్ళీ లైం లైట్ లోకి వచ్చాడు శివాజీ. ఆ ఫేమ్ తోనే కోర్ట్ సినిమా అవకాశాన్నీ దక్కించుకున్నాడు శివాజీ. ఈ సినిమాలో మంగపతి గా ఆయన పాత్ర ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆయన మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, శివాజీ మరోసారి బిగ్ బాస్ సెట్ లో అడుగుపెట్టబోతున్నాడు. అది కూడా కాటెస్టెంట్ గా కాదు హోస్ట్ గా.

బిగ్ బాస్ ను ప్రతీవారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ను బిగ్ బాస్ బజ్ తో ఇంటర్వ్యూ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అలా ఈ సీజన్ కి శివాజీని హోస్ట్ గా తీసుకున్నారు బాగ్ బాస్ టీం. గత సీజన్ ను అర్జున్ అంబటి హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్ కి శివాజీ హోస్ట్ గా చేయనున్నాడు. దీనికి సంబందించిన ప్రోమోను కూడా మేకర్స్ విడుదల చేశారు. అయితే, ప్రోమోలోనే ఈ బజ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో క్లియర్ గా చెప్పేశాడు శివాజీ. ప్రతీ కంటెస్టెంట్ లోపల ఫీలింగ్స్ ని, వాళ్ళ నిజ స్వరూపాన్ని ఈ బజ్ ద్వారా బయటకు తీసుకురాబోతున్నారు శివాజీ. మరి ఈ బజ్ ఎలా ఉండబోతుందో చూడాలి.