Dashvika : మలయాళం థ్రిల్లర్స్ లాగే.. తత్వం సినిమాపై హీరోయిన్ దష్విక

సినిమా హీరోయిన్ దష్విక.కె నేడు మీడియాతో ముచ్చటించి సినిమా గురించి పలు విషయాలు తెలిపింది. (Dashvika)

  • Published on- September 28, 2026 / 07:01 PM IST

Dashvika

Dashvika : దినేష్‌ తేజ్‌, దష్విక.కె జంటగా ఆతెరకెక్కుతున్న సినిమా తత్వం. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ నిర్మాణంలో అర్జున్‌ కోల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 2న థియేటర్స్ లోకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా హీరోయిన్ దష్విక.కె నేడు మీడియాతో ముచ్చటించి సినిమా గురించి పలు విషయాలు తెలిపింది.

దష్విక తన గురించి చెప్తూ.. మాది వైజాగ్‌. ఇదే నా మొదటి సినిమా. గతంలో విజయ్ దేవరకొండతో కలిసి ఒక యాడ్ చేశాను. ఆ తర్వాత మహతి భిక్షు దగ్గర యాక్టింగ్ నేర్చుకొని సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈ అవకావం వచ్చింది అని తెలిపారు.

Also Read : Raja Kumari : మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన OG సింగర్ రాజకుమారి.. లేడీ డైరెక్టర్ సినిమాకు..

తత్వం సినిమాలో తన పాత్ర గురించి చెప్తూ.. ఫస్ట్‌ సినిమాలోనే హీరోయిన్‌కు నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర దొరకడం లక్కీగా ఫీలవుతున్నాను. ఈ కథ వినగానే ఇంట్రెస్టింగ్‌ గా అనిపించింది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్‌ ఉన్న పాత్ర ఇది. నా పాత్రలో గ్రే షేడ్స్‌ ఉంటాయి కానీ అందరికి నచ్చే పాత్ర. ఇంతకు మించి ఇప్పుడు రివీల్‌ చేయకూడదు. హీరోకు సపోర్ట్‌ చేసే పాత్ర కూడా అని తెలిపారు.

తత్వం సినిమా గురించి చెప్తూ.. మలయాలంలో ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. తెలుగులో కూడా ఇలాంటి కథతో సినిమా రావడం ఆనందంగా అనిపించింది. బోరింగ్‌గా ఉండదు. ఇదిమర్డర్‌ మిస్టరీ సస్పెన్స్‌. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథ కొనసాగుతుంది. హీరో దినేష్ తేజ్‌ యాక్షన్‌ సీక్వెన్సీలో నాకు బాగా సపోర్ట్‌ చేశారు. దర్శకుడు అర్జున్‌ కోలా స్టాప్టవేర్‌ జాబ్‌ చేస్తూ మూడు నెలలు లీవ్‌ తీసుకుని ఈ సినిమా చేసాడు. టైటిల్‌లాగా సినిమా కూడా ఖచ్చితంగా డిఫరెంట్‌ గా ఉంది అని తెలిపారు.

Also Read : Nani : ఫేక్ కలెక్షన్స్ కాదు.. నాని కౌంటర్ ఇచ్చాడా? డిస్ట్రిబ్యూటర్ లెక్కల షీట్లు తీసుకొచ్చి..

తన నెక్స్ట్ సినిమాల గురించి చెప్తూ.. నాకు అన్ని తరహా పాత్రలు చేయాలని ఉంది. ముఖ్యంగా లవ్‌స్టోరీస్‌ చేయాలని ఉంది. నవంబరులో ఒక తమిళ సినిమా మొదలవుతుంది. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను అని తెలిపారు.