×
Ad

Divi : చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నా నా నడుము గిల్లాడు.. బాడకవ్.. దివి కామెంట్స్ వైరల్..

ఓ ఇంటర్వ్యూలో ఇటీవల తాను ఎదుర్కున్న ఓ చేదు అనుభవం గురించి తెలిపింది దివి.(Divi)

Divi

Divi : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న దివి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. దివి నటించిన హనీ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇటీవల తాను ఎదుర్కున్న ఓ చేదు అనుభవం గురించి తెలిపింది.(Divi)

Also Read : Barabar Premistha : ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ రివ్యూ.. కులాంతర ప్రేమకథతో యాటిట్యూడ్ స్టార్ సినిమా ఎలా ఉందంటే..

దివి మాట్లాడుతూ.. ఇటీవల ఒక పబ్ ఈవెంట్ కి నన్ను పిలిచారు. నా చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నారు. గుంపుగా చుట్టూ ఉండి నన్ను తీసుకెళ్తున్నారు. నన్ను తీసుకెళ్తుంటే మధ్యలో ఒకడు వాళ్ళ మధ్యలోంచి చేయి పెట్టి నా నడుము గిల్లాడు. అతను నా నడుముని పట్టుకున్నది నాకు తెలుసు. మెల్లగా వచ్చి అలా నడుముని అనేసి ఏమి తెలియనట్టు నిల్చొని చూస్తున్నాడు.

వెంటనే సీరియస్ గా చూసి తలపై గట్టిగా కొట్టి బాడకవ్ అని తిట్టి వెళ్ళిపోయా. ఒకవేళ నేను అలా కొట్టి తిట్టి వెళ్లకపోతే నేను బ్యాడ్ గా ఫీల్ అవుతా. అది నా తప్పు కాదు. అంత మంది బాడీ గార్డ్స్ ఉన్నా వాడు అలా చేసాడు. అప్పటిదాకా నేను ఫ్రీగా నడిస్తే ఆ సంఘటన తర్వాత జాగ్రత్తగా చేతులు దగ్గరికి పెట్టుకొని నడవాల్సి వచ్చింది అని తను ఎదుర్కున్న ఆ చెడు సంఘటన గురించి తెలిపింది.

Also Read : Euphoria Review : ‘యుఫోరియా’ మూవీ రివ్యూ.. ఈ జనరేషన్ పేరెంట్స్, పిల్లలు కచ్చితంగా చూడాల్సిన సినిమా..