Divyanka Sirohi : పాపం.. 29 ఏళ్ళ వయసులోనే నటి మృతి.. విషాదంలో సినీ పరిశ్రమ.. ఎలా మరణించిందంటే..

తాజాగా 29 ఏళ్ళ వయసులోనే ఈ నటి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. (Divyanka Sirohi)

  • Published on- April 22, 2026 / 08:35 PM IST

Divyanka Sirohi

Divyanka Sirohi : ఇటీవల పలువురు చిన్నవయసులోనే అనేక కారణాలతో మరణిస్తున్నారు. సినీ సెలబ్రిటీలతో కూడా చిన్న వయసులోనే మరణించినవాళ్లు ఉన్నారు. తాజాగా 29 ఏళ్ళ వయసులోనే ఈ నటి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఉత్తరప్రదేశ్ కి చేందిన నటి దివ్యాంక సిరోహి. డిగ్రీ పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం ఘజియాబాద్ లో పేరెంట్స్ తో కలిసి నివసిస్తుంది. ఉత్తరప్రదేశ్, హర్యానాలో లోకల్ భాషల్లో మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించడం మొదలుపెట్టి మంచి ఫేమ్ తెచ్చుకుంది. దాదాపు 50 కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించింది దివ్యాంక సిరోహి. పలు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిగా ఎదుగుతుంది. సోషల్ మీడియాలో కూడా మంచి ఫేమ్ తెచ్చుకుంది.

Also Read : Teena Sravya : బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన భామ.. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం..

ఏప్రిల్ 21 మంగళవారం రాత్రి దివ్యాంక సిరోహికి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు సమీప హాస్పిటల్ కి తరలించారు. చికిత్స అందుకుంటూనే ఆమె మరణించింది. దీంతో దివ్యాంక సిరోహి కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. హర్యానా, ఉత్తరప్రదేశ్ సంగీత పరిశ్రమలో కూడా విషాదం నెలకొంది. అనేకమంది సెలబ్రిటీలు, ఆమె ఫ్యాన్స్ నివాళులు అర్పించారు.

నేడు మధ్యాహ్నం ఘజియాబాద్ లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె అంత్యక్రియలకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. బాలీవుడ్ లో నటిగా ఎదగాలన్న దివ్యాంక సిరోహి ఇలా 29 ఏళ్లకే అర్దాంతరంగా గుండెపోటుతో మరణించడం ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read : Jetlee : జెట్లీ ట్రైలర్ వచ్చేసింది.. సత్య కామెడీ అదరగొట్టాడుగా..