Teena Sravya : బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన భామ.. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం..
ఇప్పుడు టీనా శ్రావ్య తన మూడో సినిమాతో రాబోతుంది. (Teena Sravya)
Teena Sravya
Teena Sravya : కమిటీ కుర్రాళ్ళు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది టీనా శ్రావ్య. ఆ రెండు సినిమాల్లో కూడా విలేజ్ అమ్మాయి పాత్రలో క్యూట్ గా కనిపించి మెప్పించడమే కాక నటనతో అలరించింది. ఆ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి అంతకు మించి చాలా అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు టీనా శ్రావ్య తన మూడో సినిమాతో రాబోతుంది.
రఘు కుంచె మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న గేదెల రాజు కాకినాడా తాలూకా అనే సినిమాలో టీనా శ్రావ్య కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉన్న ప్రేమకథలో హీరోయిన్ గా కనిపించనుంది. తన నటనతో మరోసారి మెప్పించనుంది. ఈ సినిమా ఏప్రిల్ 24 రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
Also Read : Jetlee : జెట్లీ ట్రైలర్ వచ్చేసింది.. సత్య కామెడీ అదరగొట్టాడుగా..
టీనా శ్రావ్యని, తన పర్ఫార్మెన్స్ లను చూస్తుంటే చిన్న బడ్జెట్, విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలకు పర్ఫెక్ట్ హీరోయిన్ గా సరిపోతుందని తెలుస్తుంది. గేదెల రాజు సినిమా ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంది ఈ భామ. తెలుగమ్మాయి కావడం మరింత కలిసొచ్చే అంశం. ఈ సినిమా తర్వాత మరో సినిమా కూడా లైనప్ లో ఉందని సమాచారం. మరి గేదెల రాజు కాకినాడ తాలూకా సినిమాలో టీనా శ్రావ్య ఎలా మెప్పిస్తుందో చూడాలి.

