Kasturi Shankar : ఆ రూమర్ వల్ల తనకి పెళ్లి చేసేసారట..ఆ నటి చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు

అన్నమయ్య, భారతీయుడు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న నటి కస్తూరి ప్రస్తుతం టీవీ, సినిమా రంగంలో బిజీగా ఉన్నారు. 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్‌లో తులసి పాత్రతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇటీవల కస్తూరి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Kasturi Shankar

Kasturi Shankar : మోడల్‌గా, యాంకర్‌గా కెరియర్ మొదలు పెట్టి హీరోయిన్‌గా చాలా సినిమాల్లో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు కస్తూరి శంకర్. కెరియర్ మంచి పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న ఈ నటి తాజా ఇంటర్వ్యూలో జీవితంలో తను ఎదుర్కున్న అనుభవాలను షేర్ చేసుకున్నారు.

నటి కస్తూరి అసలు పేరు సుమతి శంకర్. లా చదువుకున్న కస్తూరి నటిగా ఎదిగారు. తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు కస్తూరి మోడల్‌గా, యాంకర్‌గా కూడా పనిచేసారు. కస్తూరి 1992 లో మిస్ చెన్నైగా గెలుపొందారు. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా సెలక్ట్ అయ్యారు. 2019 లో తమిళ బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్‌గా ఉన్నారు.  సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైమ్‌లో ఓ రూమర్ వల్ల తనకు పేరెంట్స్ పెళ్లి చేసేసారని రీసెంట్‌గా కస్తూరి శంకర్ వెల్లడించారు. తను ఎదుర్కున్న కష్టాలను గుర్తు చేసుకున్నారు.

Unstoppable With NBK : బాలీవుడ్ మీట్స్ బాలయ్య.. ఆహా అన్‌స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ అనౌన్స్..

కస్తూరి శంకర్ వరుస సినిమాలో చేస్తున్న టైమ్‌లో ఓ ఇండస్ట్రియలిస్ట్‌తో ఎఫైర్ ఉందంటూ పుకార్లు పుట్టించారట. దాంతో పేరెంట్స్ భయపడి ఎర్లీగా పెళ్లి చేసేసారట. అప్పుడు వాళ్లు చేసింది కరెక్ట్ అని నాకు అనిపించింది. అందుకు తాను బాధపడలేదని అన్నారు కస్తూరి. జీవితంలో ఎన్నో కష్టాలను చూసానని ప్రస్తుతం జీవితం ప్రోత్సహకరంగా ఉందని చెప్పుకొచ్చారు.

తప్పును తప్పు అని చెబితే కాంట్రవర్సీ చేస్తున్నారని.. అలాంటి వారి కోసం తాను మాట్లాడకుండా ఉండనని చెప్పారు కస్తూరి. తనను ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు కానీ అనవసరమైన విమర్శలు చేస్తే ఊరుకోను అన్నారు. కొన్ని సినిమాల్లో చేజారిన అవకాశాలను కస్తూరి గుర్తు చేసుకున్నారు. కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘సింధూరం’ సినిమాలో రవితేజకు జోడిగా రెండు రోజుల షూటింగ్ లో పాల్గొన్నానని..అయితే అనుకోని కారణాలతో ఆ క్యారెక్టర్ నుంచి తనను తొలగించారని కస్తూరి చెప్పారు. ఇటీవల ‘యానిమల్’ సినిమాలో రష్మిక తల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చినా ఆమెకు అక్కలా ఉన్నానని అవకాశం చేజారిందన్నారు. రాజమౌళి సినిమాలో పనిచేయాలని ఉందని చెప్పిన కస్తూరి ప్రస్తుతం మంచి రోల్స్ వస్తున్నాయని చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పారు.

Manchu Lakshmi : పేద విద్యార్థులతో మంచు లక్ష్మి దీపావళి సెలబ్రేషన్స్..

కస్తూరికి 2000 లో శ్రీకుమార్ సుబ్రమణియన్‌తో వివాహమైంది. మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. కస్తూరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోవడం.. కుమార్తె క్యాన్సర్‌తో బాధపడటంతో కస్తూరి కొన్ని ఒడిదుడుకులు చూసారు. ప్రస్తుం ఆమె కుమార్తె లుకేమియా సర్వైవర్. బుల్లితెరపై ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో తులసి పాత్రతో చాలా పాపులర్ అయ్యారు కస్తూరి.. పలు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.