Bigg Boss 19 : బిగ్‌బాస్ షోలో అండర్‌టేకర్, మైక్ టైసన్..! వైల్డ్ కార్డ్ ఎంట్రీస్..?
ఆగస్టు 24 నుంచి బిగ్‌బాస్ 19 (Bigg Boss 19) సీజన్ ప్రారంభం కానుంది. ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

Bigg Boss 19 Mike Tyson and Undertaker might also join Salman Khans hosted show
Bigg Boss 19 : దేశ వ్యాప్తంగా ఎన్ని రియాలిటీ షోస్ వచ్చినా కూడా బిస్‌బాస్ (Bigg Boss) రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్‌బాస్ రియాలిటి షో ప్రారంభమైన అన్ని భాషల్లో మంచి సక్సెస్ సాధించింది. ఇక హిందీ బిగ్‌బాస్ షోకు ఉన్న ఆదరణ నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటికే విజయవంతంగా 18 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షోకు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు.
ఇక ఇప్పుడు 19 సీజన్(Bigg Boss 19) తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 24 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ సీజన్‌లో మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, డబ్ల్యూడబ్ల్యూఈ అండర్‌టేకర్‌లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారు అనే వార్తలు హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటికే షో నిర్వాహకులు ఈ విషయం పై వారితో సంప్రదింపులు జరుపుతున్నారట.
Prema Katha : ‘ప్రేమకథ’ మూవీ రివ్యూ.. కేవలం ప్రేమకథే..
ఈ డీల్ ఓకే అయితే.. వీరిద్దరు ఓ వారం పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే.. బిగ్‌బాస్ 19 రియాలిటీ షో చరిత్రలో నిలిచిపోతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
బిగ్‌బాస్ 19 సీజన్‌లో పాల్గొనేది వీరేనా?
గౌరవ్ ఖన్నా, అఘ్నార్ కౌర్, అవేజ్ దర్బార్, నగ్మా మిరాజ్‌కర్, బసీర్ అలీ, అభిషేక్ బజాబ్, హునార్ హేల్, సివేట్ తోమర్, ఖాస్క్ వాఘ్నాని, గేమర్ పాయల్ ధరే, జీషన్ క్వాద్రీ తదితరులు పాల్గొనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ఎవరు షోలో ఉంటారో చూడాల్సిందే.
ఈ సీజన్‌ను ఎక్కడ చూడాలి
ఆగస్టు 24 నుంచి బిగ్‌బాస్ 19 సీజన్ ప్రారంభం కానుంది. జియో హాట్‌స్టార్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తారు. ఆ తరువాత కలర్స్ టీవీలో రాత్రి 10.30 గంటలకు ప్రసారం కానుంది.