Malavika Avinash : ఆధార్ వివరాలు ఎవరికీ ఇవ్వకండి.. తనకు జరిగిన మోసాన్ని వివరించిన నటి

ఆధార్ కార్డు ఇతరులకు షేర్ చేయడం వల్ల ఎలాంటి చిక్కులు వస్తాయో తెలుసా? ఓ నటి తనకు జరిగిన మోసాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆధార్ డీటెయిల్స్ ఎవరికీ ఇవ్వకండని సూచించారు.

Malavika Avinash

Malavika Avinash : ఆధార్ కార్డ్ ఎవరికి పడితే వారికి షేర్ చేస్తున్నారా? దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? కేజీఎఫ్ సినిమాలో నటించిన మాళవిక అవినాష్ ఆధార్ కార్డు దుర్వినియోగం కావడం వల్ల ఎలాంటి చిక్కుల్లో పడ్డారో తెలిస్తే .. అందరూ జాగ్రత్త పడతారు.

Mrunal Thakur : నలుపు చీరలో స్టేజిపై మృణాల్ ఠాకూర్ నిగనిగలు..

మాళవిక అవినాష్.. కేజీఎప్ సినిమాలో జర్నలిస్ట్ దీపా హెగ్డే పాత్రలో అలరించిన నటి.. అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. తన ఆధార్ కార్డు ఎలా దుర్వినియోగం అయ్యిందో తెలిస్తే మీరంతా షాకవుతారు. అంతేకాదు అలర్ట్ అవుతారు. రీసెంట్‌గా ముంబయి పోలీస్ స్టేషన్‌లో మాళవిక మీద కేసు నమోదైంది. అదీ ఆమె పలువురిని బెదిరిస్తున్నట్లు, అసభ్యకర సందేశాలు పంపుతున్నట్లు వేధింపులకు గురైన వారంతా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మాళవిక అవినాష్‌ను అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు.

Chitra : సౌందర్య బయోపిక్ తీస్తే ఈ అమ్మాయి సరిపోతుందా? .. అచ్చం సౌందర్యలా ఉన్న ఈ అమ్మాయి..

కట్ చేస్తే అప్పుడే అసలు విషయం తెలిసింది. మాళవిక పోలీసులకు ఫోన్ చేసి తన ఆధార్ కార్డును సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసారని ఫిర్యాదు చేశారు. అంతేకాదు ట్రాయ్ నుంచి కూడా తనకు నోటీసులు అందాయని చెప్పారు. సైబర్ నేరస్తులు మాళవిక ఆధార్ కార్డు ద్వారా సిమ్ కొనుగోలు చేసి ఇతరులను బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తుండటంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సంస్థ ఆమె సిమ్‌ను డీయాక్టివేట్ చేసిందట.

మాళవిక  సిమ్‌ను ముంబయిలో గుర్తు తెలియని వ్యక్తి ఉపయోగిస్తున్నట్లు తెలియడంతో పోలీసులు మాళవికను ముంబయిలో ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం వీడియో కాల్ ద్వారా పోలీసులకు తన ఫిర్యాదును పంపిన మాళవిక ఈ విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో వీడియో ద్వారా సూచించారు.