Chitra : సౌందర్య బయోపిక్ తీస్తే ఈ అమ్మాయి సరిపోతుందా? .. అచ్చం సౌందర్యలా ఉన్న ఈ అమ్మాయి..

నీలాంటి వ్యక్తిని చూసాను.. అనే మాట చాలామంది నోట వింటూ ఉంటాం. కాస్త అటూ ఇటూగా మనిషిని పోలిన మనిషిని చూసి ఉంటాం.. కానీ చూడగానే సౌందర్య మళ్లీ పుట్టిందా? అనిపించేలా కనిపిస్తున్న ఓ అమ్మాయిని మీరు చూసారా?

Chitra : సౌందర్య బయోపిక్ తీస్తే ఈ అమ్మాయి సరిపోతుందా? .. అచ్చం సౌందర్యలా ఉన్న ఈ అమ్మాయి..

Chitra

Updated On : November 5, 2023 / 10:27 AM IST

Chitra : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. అంతమంది ఉంటారో? లేదో? తెలియదు కానీ.. నటి సౌందర్యను పోలిన అమ్మాయి ఒకరున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ‘జూనియర్ సౌందర్య’ అంటూ చాలామంది ఆమెను అభిమానిస్తున్నారు. అచ్చంగా సౌందర్యలా అనిపించే ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటుంది? ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వివరాలు చెప్పింది.

Soundarya last wish : సౌందర్య కోరిన చివరి రెండు కోరికలు.. తీరకుండానే తరలిరాని లోకాలకు..

అందంతో పాటు నటనలో హుందాతనం ఉట్టిపడే నటి సౌందర్య. అద్భుతమైన సినిమాల్లో నటించి ఎంతో భవిష్యత్ ఉండగానే విమాన ప్రమాదంలో కన్నుమూసారు. ఆమె భౌతికంగా లేకపోయినా అభిమానుల గుండెల్లో సౌందర్య చెరగని ముద్ర వేసుకున్నారు. టీవీలో ఆమె సినిమా వస్తుంటే కళ్లార్పకుండా చూసే అభిమానులు ఉన్నారు. ఆమె స్ధానాన్ని భర్తీ చేసే మరో నటి లేదనే చెప్పాలి. అయితే సౌందర్య పోలికలతో సోషల్ మీడియాలో ఓ అమ్మాయి చేస్తున్న రీల్స్ చూసి జనం షాకయ్యారు. సౌందర్య పాటలకు రీల్స్ చేయడంతో పాటు.. సౌందర్యలాగ చక్కని చీరకట్టులో కట్టుబొట్టుతో ఆమె చేస్తున్న వీడియోలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఒక్కసారిగా ఆ అమ్మాయి వైరల్ అయిపోయింది. జూనియర్ సౌందర్య అని అందరూ మురిసిపోయేంతలా మరిపించిన ఆ అమ్మాయి పేరు చిత్ర.

చిత్ర రీసెంట్‌గా తనను తాను పరిచయం చేసుకుంటూ మీడియాలో తన వివరాలు చెప్పింది. చిత్ర పుట్టి పెరిగింది మలేషియాలో. స్కూల్ ఫ్రెండ్‌నే ప్రేమ వివాహం చేసుకున్న చిత్రకు ఇద్దరు పిల్లలు కూడా. అకౌంటెంట్ జాబ్ వదిలిపెట్టి సొంతంగా బిజినెస్ చేస్తున్నారు. చిత్రను చిన్నతనంలో  ఫ్రెండ్స్ నటి సౌందర్యలా ఉన్నావని కాంప్లిమెంట్స్ ఇచ్చేవారట. తనకి కూడా సౌందర్య నటన అంటే చాలా ఇష్టమట. కొంతకాలంగా సౌందర్య పాటలకు రీల్స్ చేయడం హాబీగా మలుచుకున్న చిత్ర చాలా పాపులర్ అయ్యారు. ఆమె వీడియోలు చూసి ఇండియా నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారని.. బహుమతులు పంపిస్తున్నారని.. ముఖ్యంగా చీరలు పంపారని చిత్ర చెప్పారు. సినిమాల్లో నటించడానికి, ప్రోగ్రామ్స్ చేయడానికి ఇండియా రమ్మని ఆహ్వానిస్తున్నారని ఆమె తెలిపారు. తన ఫాలోవర్స్ ద్వారా తన రీల్స్ చూసి సౌందర్య కజిన్ తనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ వారికి మెసేజ్ చేయడం చాలా సంతోషం అనిపించిందని చిత్ర చెప్పారు.

NBK 110 : బాలయ్య 110వ సినిమా అనౌన్స్ చేశారా? వైరల్ అవుతున్న పోస్టర్..

చాలామంది నటీనటుల బయోపిక్స్ వచ్చాయి. అలరించాయి.. నటి సౌందర్య బయోపిక్ తీయాలంటే నటనలో సౌందర్యను తలపించే సామర్థ్యం ఉన్న నటీమణి కావాలి. చిత్రకు అవకాశం ఇస్తే నటిస్తానని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న చిత్ర, రీల్స్ వరకేనా ? లేక నటనలోనూ సౌందర్యను తలపించగలరా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ డిసెంబర్‌లో ఇండియా వస్తున్న చిత్ర సినిమాల్లో నటించడం ఎలా ఉన్నా.. ఆమెను ఒకసారి చూసి మాట్లాడాలనే అభిమానులు మాత్రం క్యూలో ఉన్నారు. సౌందర్య లాంటి నటీమణి మళ్లీ పుట్టరన్నది అందరి మాట.. కనీసం ఆ లోటును భర్తీ చేయడానికి చిత్ర లాంటి వారికి అవకాశం ఇస్తే బానే ఉంటుంది. మరి చిత్రకు తెలుగు సినిమా అలాంటి అవకాశం ఇస్తుందా? వేచి చూద్దాం.

 

View this post on Instagram

 

A post shared by Chitra❤ (@chitra_jii2)