Megha Akash : పెళ్లి పనులు మొదలుపెట్టిన హీరోయిన్.. ఘనంగా మెహందీ వేడుక..

ఇటీవల మేఘ ఆకాష్ విష్ణు అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

Actress Megha Akash Wedding Works Started Mehendi Celebrations Photos goes Viral

Megha Akash : హీరోయిన్ మేఘ ఆకాష్ తెలుగులో ‘లై’, ఛల్ మోహన రంగ, డియర్ మేఘ, గుర్తుందా శీతాకాలం, రావణాసుర.. ఇలా పలు సినిమాలతో మెప్పించింది. ఇటీవల మేఘ ఆకాష్ విష్ణు అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మేఘ ఆకాష్ – విష్ణు ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

Also Read : NTR – Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగతో ‘దేవర’.. స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో చూశారా?

తాజాగా ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆల్రెడీ పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారు. మేఘ ఆకాష్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది, ఎక్కడ చేసుకుంటుంది అనే డీటెయిల్స్ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా మెహందీ డే జరిగింది అంటూ తనకు కాబోయే భర్తతో పలు ఫొటోలు షేర్ చేసింది మేఘ ఆకాష్. దీంతో రేపు లేదా ఎల్లుండే పెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ జంటకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.