పోలీసుల అదుపులో పూనమ్ పాండే

  • Publish Date - November 5, 2020 / 05:09 PM IST

కేరాఫ్ కాంట్రవర్శీ నటి పూనమ్ పాండే చిక్కుల్లో చిక్కుకుంది. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇటీవల గోవాలో ఓ షూట్ పూర్తి చేసి ముంబైకి తిరిగి రాగా.. గోవాకి చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.



పూనమ్ పాండే గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించిందని ఆరోపిస్తూ ఫార్వర్డ్ పార్టీ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా.. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గోవాలోని కాంకోనా గ్రామంలోని చపోలి ఆనకట్ట వద్ద షూటింగ్ సమయంలో పాండే అశ్లీలంగా కనిపించిందని కేసు నమోదైంది.



పూనమ్‌ పాండేపై అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించినందుకు ఓ గుర్తుతెలియని వ్యక్తిపై మరో కేసు నమోదైంది. కోస్టల్ ఏరియాలో అసభ్యంగా కనిపించడడం.. అలాగే ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చెయ్యడం వంటి నేర అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి.