Actress Priya : కాలికి గాయంతో మంచానికే పరిమితమయిన నటి ప్రియ.. వీడియో వైరల్..
సీనియర్ నటి ప్రియ ఇప్పుడు కాలికి గాయంతో మంచానికే పరిమితమయింది. (Actress Priya)
- Saketh U
- Published on- September 27, 2026 / 10:26 AM IST
Actress Priya
Actress Priya : ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సీనియర్ నటి ప్రియ ఇప్పుడు కాలికి గాయంతో మంచానికే పరిమితమయింది. నటిగా, బిగ్ బాస్ సీజన్ 5 తో ఫేమ్ తెచ్చుకున్న ప్రియ సినిమాలు, టీవీ షోలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ప్రియ తన కాలికి గాయం అయి, కట్టు కట్టి మంచం మీద రెస్ట్ తీసుకుంటున్న ఫోటోలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రియ వీడియోని షేర్ చేసి.. మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నాను. వేడి సూప్ తాగుతూ, ముదురు గులాబీ రంగు పట్టీతో నెమ్మదిగా కాలం గడుపుతున్నాను. మీరు ప్రేమను, మంచి ఆలోచనలను, తక్కువ శ్రమతో చేసే లేదా కూర్చుని చేసే హాబీల లిస్ట్ పంపండి. నా కాలు నయమయ్యేలోపు నా మనసును బిజీగా ఉంచడానికి అన్ని ఆలోచనలు కావాలి. అలాగే మీ ప్రార్థనలు కూడా అని పోస్ట్ చేసింది.
Also Read : Tollywood : సినీ పరిశ్రమలో విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో దర్శకుడి భార్య కన్నుమూత..
దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ప్రియ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే వినాయకచవితి లడ్డూ వేలంపాటలో సందడి చేసిన ప్రియ ఇప్పుడు ఇలా కాలికి పట్టితో మంచం పై రెస్ట్ తీసుకుండటంతో ఏం జరిగింది అని కామెంట్స్ చేస్తున్నారు.
