Tollywood : సినీ పరిశ్రమలో విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్తో దర్శకుడి భార్య కన్నుమూత..
ర్శకుడు ప్రదీప్ అద్వైతం భార్య బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారు. (Tollywood)
Tollywood
Tollywood : టాలీవుడ్ లో విషాదం నెలకొంది. దర్శకుడు ప్రదీప్ అద్వైతం భార్య బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారు. అద్వైతం షార్ట్ ఫిల్మ్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు బిల్లా రంగా, మైనే ప్యార్ కియాలతో పటు ఇటీవల రోషన్ తో ఛాంపియన్ సినిమా తీసి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య దీప్తి రెడ్డి వ్యాపారవేత్త గా పలు బిజినెస్ లు చేస్తుంది.
కొన్ని రోజుల క్రితం ప్రదీప్ భార్య దీప్తి రెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స తీసుకుంటూనే దీప్తి శనివారం రాత్రి ప్రాణాలు విడిచారు. దీంతో భర్త, ఇద్దరు పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణవార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు ప్రదీప్ కు సానుభూతి వ్యక్తం చేశారు. దీప్తి తన అవయవాలను దానం చేస్తానని ఓ ఫౌండేషన్ కి ముందే ప్రకటించడంతో కుటుంబసభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. దీంతో పలువురు ఆమెని అభినందిస్తున్నారు.
Also Read : KTR : ‘ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ రివ్యూ.. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అంటూ..
