Rambha : రంభ కూతురు ఎంత అందంగా ఉందో చూసారా?

ఒకప్పుడు వెండితెరపై తన అందం, నటనతో రంభ ఒక ఊపు ఊపేశారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రంభ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద కూతురితో రంభ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.

Rambha

Rambha : నటి రంభను ఎవరూ మర్చిపోరు. 1990-2000 లో సిల్వర్ స్క్రీన్‌ను ఒక ఊపు ఊపారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ, బెంగాలీ, భోజ్ పురి భాషలలో రంభ నటించారు. 2010 లో పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు రంభ. రీసెంట్‌గా రంభ తన కూతురితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆమె కూతురి ఫోటో వైరల్ అవుతోంది.

Rambha

రంభ అసలు పేరు విజయలక్ష్మి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన రంభ 15వ ఏట స్కూల్ చదువులకు స్వస్తి చెప్పి ‘స్వర్గం’ అనే మళయాళ సినిమాతో కెరియర్ స్టార్ట్ చేశారు. ఇక ఈవీవీ సత్యనారాయణ డైరెక్షలో ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో రాజేంద్రప్రసాద్‌కి జోడీగా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిట్ కావడంతో రంభకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఏవండీ ఆవిడ వచ్చింది, తొలి ముద్దు, భైరవ ద్వీపం, ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, బొంబాయి ప్రియుడు, హిట్లర్, బావగారు బాగున్నారా?, మూడు ముక్కలాట వంటి సినిమాలతో పాటు కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాటల్లో సైతం అలరించారు. 2010 లో వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను పెళ్లాడిన రంభ సినిమాలకు దూరమయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

Sarfaraz Khan : సూర్య వ‌ల్లే ఇదంతా.. అలా మెసేజ్ చేసి ఉండ‌క‌పోతే.. స‌ర్ఫ‌రాజ్ తండ్రి

ప్రస్తుతం కెనడాలో ఉంటున్న రంభ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా రంభ తన పెద్ద కూతురితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మై ఏంజల్’ అంటూ రంభ షేర్ చేసిన ఫోటో చూసిన నెటిజన్లు ఎంత బాగుందో అంటూ కితాబు ఇస్తున్నారు. లిటిల్ రంభ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.