Renu Desai : రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. విషాదంలో రేణు దేశాయ్ కుటుంబం..
తాజాగా రేణు దేశాయ్ కుటుంబంలో విషాదం నెలకొంది.

Actress Renu Desai Mother Passed Away Renu Shares Emotional Post
Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా తన పిల్లలు ఆద్య, అకిరా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రేణు దేశాయ్ కుటుంబంలో విషాదం నెలకొంది.
Also Read : Meghnathan : ఆ వ్యాధితో బాధపడుతూ.. కన్నుమూసిన ప్రముఖ నటుడు..
రేణు దేశాయ్ తల్లి నేడు మరణించినట్లు తెలుస్తుంది. తాజాగా రేణు దేశాయ్ తన తల్లి పాత ఫొటో షేర్ చేసి.. ప్రశాంతంగా ఉండు అమ్మ. ఓం శాంతి. పుట్టిన వారు మరణించాక తప్పదు, మరణించిన వారు మళ్ళీ పుట్టాక తప్పదు అని అర్ధం వచ్చేలా ఓ కొటేషన్ షేర్ చేసింది. దీంతో పలువురు ఫ్యాన్స్, నెటిజన్లు రేణు దేశాయ్ తల్లికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
పలువురు సన్నిహితులు ఈ సమయంలో రేణు దేశాయ్ స్ట్రాంగ్ గా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.